మంగళవారం నవగ్రహాలలో కుజుడు ఎంతో ప్రీతికరమైన రోజు. సాధారణంగా కుజుడు గొడవలకు తగాదాలు కారణమని భావిస్తుంటారు. అందువల్ల మంగళవారం ఎవరు కూడా ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ఇష్టపడరు. అలాగే మంగళవారం రోజు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా బావించి పూజలు చేస్తారు. అలాంటి మంగళవారం రోజు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వరాదని భావిస్తుంటారు. అలా ఎందుకు డబ్బులు ఇవ్వకూడదు ఇక్కడ తెలుసుకుందాం….
Also Read: జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. కొత్త రకం మోసం..?
డబ్బును సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి గా భావిస్తారు. కాబట్టి డబ్బును మంగళవారం ఇతరులకు ఇవ్వడం ద్వారా మన ఇంటి నుంచి లక్ష్మీదేవిని ఇతరుల ఇంటికి పంపినట్లు అవుతుందని భావించడం వల్ల చాలామంది మంగళవారం ఇతరులకు అప్పుగా డబ్బులు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన డబ్బులు ఎప్పటికీ తిరిగి రావు.
Also Read: శివుడు చెల్లెలు ఎవరో తెలుసా? పార్వతీదేవి ఆమెను దూరం పెట్టడానికి గల కారణం?
అంతేకాకుండా ఏదైనా అత్యవసర పరిస్థితులలో ఎవరి నుంచి అయినా మనం అప్పుగా డబ్బులు తీసుకున్న ఆ డబ్బులు అవసరానికి కాకుండా వృధాగా ఖర్చవుతాయి. అందుకోసమే లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళవారం, శుక్రవారాలలో డబ్బులు అప్పుగా ఇతరులకు ఇవ్వరు. కానీ మన శాస్త్రాలలో మంగళవారం డబ్బును ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదని ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ కేవలం మనం పాటిస్తున్న ఆచారాలలో ఒక భాగమే.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
మంగళవారం కుజుడు ఆదీనంలో ఉండటంవల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బులు తీసుకుంటే గొడవలు, మనస్పర్ధలు తలెత్తుతాయి. కాబట్టి మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు అనే నియమాన్ని పాటిస్తున్నారు. అందుకే ఈ మంగళ, శుక్రవారాలలో డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడరు.