https://oktelugu.com/

మే 3 వరకు రైలు సర్వీసులు రద్దు

దేశంలో మే3వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని రైలు సర్వీసులను మే 3వరకు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ట్వీటర్లో పేర్కొంది. ఈమేరకు ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం, ఎక్స్‌ప్రెస్, సబర్బన్, మెట్రో రైల్ సర్వీసులను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాలకు అవసరమైన సామగ్రి, వస్తువులు, పార్సెల్ రైలు సర్వీసులు మాత్రం కొనసాగుతాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 14, 2020 / 02:02 PM IST
    Follow us on


    దేశంలో మే3వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని రైలు సర్వీసులను మే 3వరకు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ట్వీటర్లో పేర్కొంది. ఈమేరకు ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం, ఎక్స్‌ప్రెస్, సబర్బన్, మెట్రో రైల్ సర్వీసులను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాలకు అవసరమైన సామగ్రి, వస్తువులు, పార్సెల్ రైలు సర్వీసులు మాత్రం కొనసాగుతాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

    దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం 21రోజుల లాక్డౌన్ ప్రకటించింది. రేపటితో ఈ గడుపు ముగుస్తుండటంతో రైల్వే శాఖ రైలు సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. తాజాగా లాక్డౌన్ మరో 19రోజులపాటు కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఏప్రిల్ 20తర్వాత పరిస్థితి అంచనా వేసి కొన్ని సడలింపు చేశారు. ప్రధాని ప్రసంగం అనంతరం కొద్దిసేపటికే రైల్వే శాఖ మే3వరకు రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారి డబ్బులను వందశాతం రిఫండ్ చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు ఐఆర్‌సీటీసీలో ఎలాంటి బుకింగ్స్, అడ్వాన్స్ రిజర్వేషన్స్ ఉండవని రైల్వే శాఖ స్పష్టం చేసింది.