రాహుల్, ప్రియాంక ఎంట్రీ.. యూపీ రణరంగం!

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ యువతిపై నలుగురు కామంధులు హత్యాచారం చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో యువతి తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడింది. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీలు ఢిల్లీ నుంచి యూపీకి బయలుదేరి వెళ్లారు. Also Read: యూపీ ఉద్రిక్తం.. పోస్టుమార్టంలో దారుణ విషయాలు అయితే పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక […]

Written By: NARESH, Updated On : October 1, 2020 7:25 pm
Follow us on


ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ యువతిపై నలుగురు కామంధులు హత్యాచారం చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో యువతి తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడింది. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీలు ఢిల్లీ నుంచి యూపీకి బయలుదేరి వెళ్లారు.

Also Read: యూపీ ఉద్రిక్తం.. పోస్టుమార్టంలో దారుణ విషయాలు

అయితే పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను యూపీ శివార్లోనే అడ్డుకున్నారు. కోవిడ్ నిబంధనల సాకుతో వారిని యూపీలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. యూపీ శివార్లలో పోలీసులు వారి కాన్వాయ్ ను అడ్డుకోవడంతో వారు కాలినడకనే హత్రాస్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ యూపీలో యోగీ ఆదిత్యనాథ్ పాలనపై నిప్పుచెరిగారు. హత్రాస్ యువతి ఘటనకు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాత్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని రాహుల్, ప్రియాంకగాంధీలు డిమాండ్ చేశారు.

వీరి రాక నేపథ్యంలో పోలీసులు హత్రాస్ సరిహద్దులను మూసివేశారు. 144 సెక్షన్ విధించారు. భారీ సంఖ్యలో భారీకేడ్లను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయని వాటిని అక్టోబరు 31వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా సెప్టెంబర్ 14న తల్లితో కలిసి పోలానికి వెళ్లిన యువతీ అనంతరం కన్పించకుండా పోయింది.

అయితే 22న గాయాలతో యువతి అపస్మార స్థితిలో ఓ ప్రాంతంలో కన్పించగా వెంటనే స్థానికులు ఆమెను అలీఘడ్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని జంగ్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం ఆమె మృతిచెందింది. కాగా పోలీసులు బుధవారం అర్ధరాత్రి 2గంటలకు హత్రాస్ కు తీసుకొచ్చి కుటుంబ సభ్యులు లేకుండా అంత్యక్రియలు నిర్వహించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

Also Read: అప్పుల్లో కేంద్రం.. ఇక ప్రజలకు ప్యాకేజీలు లేవట?

దళితులను అణిచివేసేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బాధితులను కాపాడేందుకే పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు చేశారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన యూపీలో చర్చనీయాంశంగా మారింది. ఇక త్వరలోనే యూపీ ఎన్నికలు జరుగనుండటంతో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అస్త్రంగా వాడుతుండటంతో రాజకీయ వేడిరాజుకుంటోంది.