https://oktelugu.com/

ఛాన్స్ లు లేకపోయినా గ్లామర్ ఉంది !

‘సినీ పరిశ్రమలో ఎవరి ఫేట్ ఎలా రాసి ఉందో ఎవ్వరూ చెప్పలేరు’ అని సినీ జనాలు రెగ్యులర్ గా చెప్పుకునే మాట. అందుకు తగ్గట్లుగానే కొతమంది కెరీర్ అలాగే ఉంటుంది. హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా.. హీరోయిన్ ఛాన్స్ లు రాక ఐటమ్ సాంగ్స్ చేసుకుంటూ హాట్ బ్యూటీస్ గా మిగిలిపోతుంటారు. అయితే బాగా డబ్బులొచ్చే సందర్భంలో స్వయంగా హీరోయిన్సే ఐటెమ్ సాంగ్స్ చేస్తునప్పటికీ.. ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ అనగానే వినిపించే పేర్లల్లో ‘హంసా నందిని’ పేరు […]

Written By:
  • admin
  • , Updated On : October 1, 2020 / 05:48 PM IST
    Follow us on


    ‘సినీ పరిశ్రమలో ఎవరి ఫేట్ ఎలా రాసి ఉందో ఎవ్వరూ చెప్పలేరు’ అని సినీ జనాలు రెగ్యులర్ గా చెప్పుకునే మాట. అందుకు తగ్గట్లుగానే కొతమంది కెరీర్ అలాగే ఉంటుంది. హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా.. హీరోయిన్ ఛాన్స్ లు రాక ఐటమ్ సాంగ్స్ చేసుకుంటూ హాట్ బ్యూటీస్ గా మిగిలిపోతుంటారు. అయితే బాగా డబ్బులొచ్చే సందర్భంలో స్వయంగా హీరోయిన్సే ఐటెమ్ సాంగ్స్ చేస్తునప్పటికీ.. ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ అనగానే వినిపించే పేర్లల్లో ‘హంసా నందిని’ పేరు కూడా ఒకటి. పెద్ద వంశీ ‘అనుమానాస్పదం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ భామ ఆ తరువాత హీరోయిన్‌ గా అవకాశాలను మాత్రం సంపాదించలేకపోయింది. ఇక ఇండస్ట్రీలో తనను తాను నిలబెట్టుకోవడానికి సైడ్ క్యారెక్టర్స్, వ్యాంప్ పాత్రలు చేసుకుంటూ.. చివరకు అలాంటి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌ గా మారిపోయింది.

    Also Read: పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ !

    అయితే అవి కూడా రాక ఇబ్బంది పడుతున్న సమయంలో ‘మిర్చి’ సినిమాలో చేసిన పాట సూపర్ హిట్ అవ్వడం, దాంతో హంసా నందిని కెరీర్ మళ్ళీ ట్రాక్ పైకి ఎక్కడం.. అప్పటినుండి ఇప్పటివరకూ ఛాన్స్ లకు ఇబ్బంది పడకుండా ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొచ్చింది. పైగా అప్పట్లో హంసా నందిని స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అనే సెంటిమెంట్ కూడా వచ్చిందని.. హంసనే తన ఇంటర్వ్యూల్లో చెబుతుంటుంది. నిజం కాకపోతే ఎందుకు చెబుతుందిలే. అయితే ప్రస్తుతం ఈ హాట్ భామకు పెద్దగా అవకాశాలు లేవు, దీనికి తోడు కరోనా.. అయినా ఛాన్స్ ల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉందట. అందుకే ఫిజిక్ ను కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తోంది.

    Also Read: గల్లీబాయ్స్ తో శ్రీముఖి రచ్చ !

    తాజాగా హంసా నందినీ ఓ ఫోటోను షేర్ చేసింది. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఓ హాట్ పోజు ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మూడు పదులు దాటినా ఈ అందం ఏంటి ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇరవై ఏళ్ల అమ్మాయిలా ఎలా తనను తానూ మార్చుకుంది అని హంసా నందినీ గ్లామర్ పై తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏమైనా హంసకు ఛాన్స్ లు లేకపోయినా గ్లామర్ ఉంది. మొత్తానికి సోషల్ మీడియాలో కూడా తన క్రేజ్ ను రోజురోజుకూ పెంచుకుంటూ పోతోంది. ఇక ఈ లాక్ డౌన్‌ లో తన సొంతూరు పుణెకి వెళ్లి తెగ ఎంజాయ్ చేసిందట. పైగా తన ఇంట్లో రకరకాల వంటలు చేస్తూ వాటిని తయారు చేసే విధానాన్ని వివరిస్తూ పనిలో పనిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.