https://oktelugu.com/

Rahul Gandhi : ఆ దళిత మహిళ ఎంపీ తో రాహుల్ గాంధీ పెళ్లి.. వైరల్ అవుతున్న న్యూస్..

దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ వయసు మీద పడుతున్నా పెళ్లి గురించి ఎవరైనా అడిగితే సమాధానం దాటవేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఆయన గురించి ఓ ఆసక్తి కర చర్చ సాగుతోంది. తొందర్లోనే ఓ రాజకీయ నాయకుడి కూతురును వివాహం చేసుకోబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.

Written By:
  • Srinivas
  • , Updated On : September 12, 2024 / 08:43 PM IST

    Rahul Gandhi -Pranathi Shinde

    Follow us on

    Rahul Gandhi : ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే తోటి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చాలా ఆసక్తి ఉంటుంది. అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుంది? అనే వివరాల కోసం వెంటనే ఆరాధిస్తారు. అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల పెళ్లి విషయం రాగానే వెంటనే వారు చేసుకోబోయేది ఎవరు? అని తెలుసుకునేందుకు ట్రై చేస్తారు. అయితే రాజకీయ నాయకుల పెళ్లిళ్ల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచ్ లర్, కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ పెళ్లి విషయం అనగానే దేశ వ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంటుంది. ఎందుకంటే దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ వయసు మీద పడుతున్నా పెళ్లి గురించి ఎవరైనా అడిగితే సమాధానం దాటవేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఆయన గురించి ఓ ఆసక్తి కర చర్చ సాగుతోంది. తొందర్లోనే ఓ రాజకీయ నాయకుడి కూతురును వివాహం చేసుకోబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    కాంగ్రెస్ జాతీయ నేత రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు.ఒకప్పుడు ఆయన రాజకీయాల్లో పనికి రాడు అని అన్నవారు.. ఇప్పుడు ఆయన గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీని దేశ వ్యాప్తంగా తీసుకెళ్తూ కాపాడుతూ వస్తున్నాడు. అయితే ఇదే క్రమంలో రాహుల్ పెళ్లి ప్రస్తావన పై కూడా జోరుగా చర్చ సాగుతూ ఉంటుంది. తాను ప్రధాని అయిన తరువాతే పెళ్లి చేసుకుంటాడని రాహుల్ నిర్ణయం అని కొందరు అన్నారు. కానీ ఆ మధ్య లండన్ లో ఓ అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోతో రకరకాలుగా ప్రచారం చేశారు.

    తాజాగా రాహుల్ ను ఓ అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరగుతోంది.అయితే ఆమె ఎవరో కాదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండె కుమార్తె. ఆమె పేరు ప్రణతి షిండే. ప్రస్తుతం షోలాపూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఈమెతో కలిసి రాహుల్ జోడో యాత్రలో కలిసి కనిపించారు. అంతేకాకుండా ఎంపీగా గెలిచిన తరువాత ప్రణతి షిండే రాహుల్ ను స్వయంగా ఇంటికి ఆహ్వానించించారు కూడా.

    ఇదే కాకుండా మే 13న రాయబరేలిలో జరిగిన ర్యాలీలో ప్రణతి షిండేను కొందరు రాహుల్ ను పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నలు కూడా వేశారు. దీంతో ఆ సమాధానం రాహుల్ ఇవ్వాలని చెప్పిందంట. దీంతో రాహుల్ ను పెళ్లి చేసుకునేందుకు ప్రణతి ఇష్టంగా ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. కానీ రాహుల్ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం లేదు. కానీ ఈ ప్రచారం పై రాహుల్ ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత 20 నుంచి 30 ఏళ్లుగా రాహుల్ ఎవరిని పెళ్లి చేసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు తండ్రి లాగే రాహుల్ విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని అన్నారు. మరికొందరు మాత్రం ఇండియన్ అమ్మాయినే పెళ్లాడుతారని చెప్పారు. మొత్తంగా రాహుల్ ఎవరిని పెళ్లి చేసుకుంటారో చూడాలి. ఒకవేళ రాహుల్ దీనిపై సానుకూలంగా స్పందిస్తారా? లేదా? అనేది ఆసక్తిగ మారింది.