Heroine Rekha : సినిమా నటులు తెరపై ఆకర్షణీయంగా కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో మాత్రం మరోలా ఉంటారు. ముఖ్యంగా కొందరు నటులు పెళ్లిళ్లు చేసుకునే క్రమంలో ప్రేమలో పడుతారు. ఆ తరువాత కొంతకాలానికే విడిపోతారు. ఇంకొందరు ప్రేమలో పడి కావాలనుకున్న ప్రియుడు దక్కకపోవడంతో ఒంటరిగానే ఉండిపోతారు. కానీ బాలీవుడ్ కు చెందిన ఓ నటి పలువురితో సంబంధాలను కలిగి ఉంది.మరో ఇద్దరిని పెళ్లిళ్లు చేసుకుంది. అయినా ప్రస్తుతం ఎవరితో కలిసి ఉండకుండా ఒంటరిగానే ఉంటోంది. అంతేకాకుండా ఓ లేడీ మేనేజర్ తో కలిసి ఉంటుందన్న పుకార్లు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా నటి? ఏమిటా స్టోరీ?
బాలీవుడ్ ఇండస్ట్రీలో అలనాటి నుంచి నేటి వరకు రేఖ పేరు మారు మోగుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో సక్సెస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ నటి సినీ లైఫ్ బాగానే ఉంది. కానీ రియల్ లైఫ్ ఓ సినిమా స్టోరీగా సాగింది. వివాదాలు, ఎఫైర్లకు పేరుగా నిలిచిన రేఖ జీవితం ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. పలువురు హీరోలతో సన్నిహితంగా ఉండడంతో ఆమె గురించి రకరకాలుగా అనుకునే వారు. కానీ కొందరితో ఆమె బహిరంగంగానే సన్నిహితంగా ఉంటూ సంచలనాలు సృష్టించింది.
1980లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రేఖ. ఈమె 1966లో వచ్చిన ‘రంగుల రాట్నం’ అనే తెలుగు సినిమాలో మొదటిసారిగా కనిపించింది. ఆమె తండ్రి ప్రముఖ నటుడు జెమినీ గణేషన్. ఆయన రెండో భార్యం పుష్పవల్లి కుమార్తె రేఖ. మొదటి నుంచి సినీ బ్యాగ్రౌండ్ ఉండడంతో ఆమెకు కెమెరా ఫియర్ లేదు. దీంతో చిన్నతనంలోనే సినిమాల్లో రాణించింది. అయితే ‘పావన్ ఖాదో’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన జీవితాన్ని ప్రారంభించింది.
ఈ సినిమాలో హీరోగా నవీన్ నిశ్చల్ నటించారు. అయితే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోవడంతో రేఖ అతనితో సాన్నిహిత్యాన్ని కొనసాగించింది. ఆ తరువాత రేఖ జీవితంలోకి జితేంద్ర ప్రవేశించాడు. అయితే జితేంద్ర అప్పటికే శోభా కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. ఈమె ఎక్కువగా విదేశాల్లో ఉండడంతో జితేంద్ర రేఖతో కలిసి ఉండేవారు. ఆ తరువాత జితేంద్ర శోభా కపూర్ తోనే తన జీవితం అని చెప్పడంతో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఆ తరువాత వీరు విడపోయారు.
ఆ తరువాత రేఖ నటుడు కిరణ్ కుమార్ తో సాన్నిహిత్యం కొనసాగించింది. కానీ వీరిద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండేక విడిపోయారు. మరో నటుడు వినోద్ మెహ్రాతోనూ రేఖ ప్రేమాయణం కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను రేఖను పెళ్లి చేసుకున్నట్లు వినోద్ మెహ్రా తన పుస్తకంలో రాశారు. వీరిద్దరు ఓసారి వినోద్ మెహ్రా ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె తల్లి నిరాకరించింది. ఆ తరువాత వీరు కొన్ని కారణాల వల్ల విడిపోయారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ తోనూ రేఖ ప్రయాణం కొనసాగించారు. తన హీరో అమితాబ్ బచ్చని అని చాలా సార్లు చెప్పుుకున్నారు కూడా. ఓసారి ఫంక్షన్లో మంగళసూత్రం మెడలో ధరించి కనిపించడంతో వీరిద్దరి పెళ్లి అయిపోయిందని అనుకున్నారు. కానీ అమితాబ్ బచ్చన్ జయాను పెళ్లి చేసుకోవడంతో అతనికి దూరమయింది. 1996లో రాజ్ బబ్బర్ తో రేఖ సన్నిహితంగా ఉంది. వీరు కలిసి కొన్ని సినిమాలు చేశారు. ఆ తరువాత రేఖ తనను పెళ్లి చేసకొమ్మని అడగగా రాజ్ బబ్బర్ నిరాకరించారు.
90 వదశకంలో ప్రేమాయణం కాదని ఓ వ్యక్తితో స్థిరపడాలని అనుకుంది. దీంతో ఓ వ్యాపారవేత్త మేఖేష్ అగర్వాల్ ను కలిసింది. ఆ తరువాత పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు. కానీ ముఖేష్ అగర్వాల్ మానికంగా బాధపడుతున్నారని రేఖకు తెలిసింది. దీంతో అనుకున్నట్లు గానే మేఖేష్ అగర్వాల్ 1990 అక్టోబర్ 2న చనిపోయారు.