https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : అక్షరాలా 5.9 బిలియన్ మినిట్స్..టీఆర్ఫీ రేటింగ్స్ లో చరిత్ర తిరగరాసిన ‘బిగ్ బాస్ 8’.

ఇది అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ యొక్క పవర్. ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ ని కళ్లారా చూసినందుకు చాలా థ్రిల్ కి గురయ్యాను. ఎంటర్టైన్మెంట్ లో మేము సరికొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేసాము. మరికొంత డ్రామా, ఎంటర్టైన్మెంట్, ట్విస్ట్స్ కోసం బిగ్ బాస్ కి ట్యూన్ అయ్యి ఉండండి' అంటూ నాగార్జున ఒక ట్వీట్ వేసాడు. ఆయన ఆనందాన్ని చూసి అభిమానులు చాలా మురిసిపోయారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 12, 2024 / 08:31 PM IST

    Bigg Boss Telugu 8 TRF Ratings,

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంతటి అంచనాల నడుమ మొదలైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీజన్ 7 అన్ని విధాలుగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎప్పుడూ బిగ్ బాస్ చూడని ప్రేక్షకులను కూడా ఈ సీజన్ చూసేలా చేసింది. శివాజీ,అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య సాగిన డ్రామా కి పీక్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అంతటి బ్లాక్ బస్టర్ హిట్ సీజన్ తర్వాత వస్తున్న సీజన్ కావడంతో సీజన్ 8 పై అంచనాలు మాములుగా ఉండేవి కాదు. అలా భారీ అంచనాల నడుమ గత వారం మొదలైన ఈ సీజన్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. లాంచింగ్ ఎపిసోడ్ కి కళ్ళు చెదిరే టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయని నేడు అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా తెలిపాడు. సుమారుగా 5.9 బిలియన్ కి పైగా వాచ్ మినిట్స్, 18.9 టీఆర్ఫీ రేటింగ్స్ లాంచింగ్ ఎపిసోడ్ కి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘గత వారం లాంచ్ అయినా బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 5.9 బిలియన్ వాచ్ మినిట్స్, 18.9 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే ఆల్ టైం రికార్డు.

    ఇది అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ యొక్క పవర్. ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ ని కళ్లారా చూసినందుకు చాలా థ్రిల్ కి గురయ్యాను. ఎంటర్టైన్మెంట్ లో మేము సరికొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేసాము. మరికొంత డ్రామా, ఎంటర్టైన్మెంట్, ట్విస్ట్స్ కోసం బిగ్ బాస్ కి ట్యూన్ అయ్యి ఉండండి’ అంటూ నాగార్జున ఒక ట్వీట్ వేసాడు. ఆయన ఆనందాన్ని చూసి అభిమానులు చాలా మురిసిపోయారు. ఎందుకంటే నాగార్జున ఎన్నడూ చూడని దారుణమైన సంఘటనలను ఇటీవల కాలం లో చూసాడు. తన వేల కోట్ల రూపాయిల ఆదాయాన్ని అందించిన N కన్వెషన్ మాల్ ని ప్రభుత్వం కూల్చేయడంతో నాగార్జున చాలా నిరాశకు గురయ్యాడు. ప్రతీ సంఘటనను చిరునవ్వుతో పలకరించే నాగార్జున, ఈ సంఘటన ఎదురైనప్పుడు మాత్రం డీలా పడ్డాడు. ఆయన కళ్ళలో నుండి నీళ్లు వచ్చినంత పని అయ్యింది.

    ఇలాంటి సమయంలో ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం నాగార్జునకు కాస్త ఉపశమనం కలిగించే విషయం అని చెప్పొచ్చు. ఇక నాగార్జున ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కూలీ’ అనే చిత్రంలో నాగార్జున సిమన్ అనే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ‘కుభేరా’ అనే చిత్రం లో కూడా నటిస్తున్నాడు. ఇందులో ధనుష్ కూడా మరో హీరో గా నటిస్తున్నాడు. ఇలా చేతి నిండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో నాగార్జున ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు.