Homeజాతీయ వార్తలుRahul Gandhi : రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు

Rahul Gandhi : రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు

Rahul Gandhi : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో గతంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పరువునష్టం దావాను ఎదుర్కొంటున్న రాహుల్ ను దోషిగా నిర్థారిస్తూ సూరత్ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.

-రాహుల్ గాంధీ చేసిన తప్పేంటి?

2019 ఏప్రిల్ లో యూపీలోని కరోల్ లో జరిగిన భారీ బహిరంగ సభకు రాహుల్ హాజరయ్యారు. ప్రధాని మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న దొంగలంతా మోడీ ఇంటి పేరుతోనే ఉన్నారని కామెంట్స్ చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన లలిత్ మోడీ, నీరవ్ మోడీల గురించి ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై సూరత్ కోర్టులో పరువు నష్టం దావాను వేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ కొనసాగుతోంది.

-ఎవరు కేసు పెట్టారు? కేసులు ఏమిటి?

రాహుల్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధితంచాయని గుజరాత్ కు చెందిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ తన బాధను వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపై ఇంటిపేరుతో చేసిన వ్యాఖ్యల వ్యవహారం ద్వారా మోడీ ఇంటిపేరున్న తన పరువుకు నష్టం కలిగించారనే ఆరోపణలతో ఆయనకోర్టును ఆశ్రయించారు. రాహుల్ పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

-రాహుల్ కు రెండేళ్ల జైలు.. 15వేల జరిమానా

కేసు నమోదు చేసిన పోలీసులు… సూరత్ కోర్టుకు ఆధారాలు సమర్ఫించారు.దీనిపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సూరత్ కోర్టు.. ఇవాళ తుది తీర్పు ప్రకటించింది. ఇందులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన సూరత్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 15000 జరిమానా కూడా విధించింది. అయితే ఈ తీర్పు దేశ వ్యాప్తంగా సంచలనమైంది.

-రాహుల్ కు బెయిల్.. హైకోర్టుకు..

సూరత్ కోర్టు తాజా తీర్పుతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. అయితే సూరత్ కోర్టులోనే రాహుల్ కు ఉపశమనం లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి తాత్కాలిక బెయిల్ పొందారు. దీంతో ఊరట లభించినట్టయ్యింది. కాంగ్రెస్ శ్రేణులకు టెన్షన్ తప్పింది. కాగా ఈ కేసునకు సంబంధించి రాహుల్ గాంధీ అలహాబాద్ కోర్టును ఆశ్రయించే చాన్స్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ ప్రజలను నేరుగా కలుసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే కోర్టు తీర్పు రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాస్తా కలవర పాటుకు గురయ్యాయి. తాత్కాలిక బెయిల్ లభించడంతో ఊపిరిపీల్చుకున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular