
Trivikram – Nani : హీరో నాని దసరా చిత్ర ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నారు. విడుదలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండగా ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు. దసరా పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుండగా చెన్నై, బెంగుళూరు, ముంబైతో పాటు పలు నగరాల్లో ఆయన సంచరించారు. ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. తాజా మీడియా ఇంటరాక్షన్ లో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. చాలా కాలంగా దర్శకుడు త్రివిక్రమ్ తో ఆయన మూవీ చేస్తున్నారని ప్రచారం అవుతుండగా, స్పష్టత ఇచ్చారు.
నాని మాట్లాడుతూ… నీ కోసం కథ రాస్తాను అని త్రివిక్రమ్ ఓసారి నాతో అన్నారు. ఆయనతో నా మూవీ కన్ఫర్మ్ అయితే నా కెరీర్లోనే అద్భుతమైన మూవీ అవుతుంది. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. పరోక్షంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను మూవీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఏదో మాటల్లో మాటగా మూవీ చేద్దాం అనుకున్నాము. అది కార్యరూపం దాల్చుతుందో లేదో చెప్పలేమని నాని మాటల అర్థం. నిజానికి త్రివిక్రమ్ ఫుల్ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ తో మూవీ చేస్తున్నారు. అనంతరం అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్ తో కూడా ఆయన చేయాల్సిన మూవీ ఉందని సమాచారం. ఇంత బిజీ షెడ్యూల్స్ లో త్రివిక్రమ్ నానికి సమయం కేటాయిస్తారా అనేది సందేహమే. ఆయన టైర్ టూ హీరోల దర్శకుడిగా స్థిరపడిపోయారు. ఒకవేళ దసరా మూవీతో నాని స్టార్ హీరోల స్థాయికి వెళితే త్రివిక్రమ్ తో అవకాశం రావచ్చు.
దసరా మూవీ విజయం మీద నాని పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇది పల్లెటూరి కథ . నిజ జీవితాలకు దగ్గరగా ఉండే కథ. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కథలో లీనమవుతారు. ఆ పాత్రలతో ప్రయాణం చేస్తారు. కొన్ని సీన్స్ కి థియేటర్స్ లో ప్రేక్షకులు అరుపులు పెడతారు. దసరా చిత్రం చూశాక మీరు పుష్ప, కెజిఎఫ్ లతో పోల్చరు, అని చెప్పుకొచ్చారు. మార్చి 30న దసరా విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.