https://oktelugu.com/

సీటు మారినా పర్లేదు…ఫేటు మారకుండా చూసుకో రాజా..!

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తెలివైన రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన జగన్ని ఓ పక్క గిల్లుతూనే… మరో పక్క మీరు చల్లగా ఉండాలని అంటున్నాడు. అధికార పార్టీ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణం రాజు హై డ్రామా రెండునెలలుగా తెలుగు రాష్ట్రలలో హాట్ టాపిక్ గా ఉంది. ఆయన విమర్శల ధాటి, ప్రతిపక్షాల దాడిని మించిపోయింది. జగన్ పాలన మరియు నిర్ణయనాలను ఆయన ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే రహురామ కృష్ణం రాజు చర్యలతో విసిగిపోయిన వైసీపీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 19, 2020 / 02:18 PM IST
    Follow us on

    వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తెలివైన రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన జగన్ని ఓ పక్క గిల్లుతూనే… మరో పక్క మీరు చల్లగా ఉండాలని అంటున్నాడు. అధికార పార్టీ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణం రాజు హై డ్రామా రెండునెలలుగా తెలుగు రాష్ట్రలలో హాట్ టాపిక్ గా ఉంది. ఆయన విమర్శల ధాటి, ప్రతిపక్షాల దాడిని మించిపోయింది. జగన్ పాలన మరియు నిర్ణయనాలను ఆయన ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే రహురామ కృష్ణం రాజు చర్యలతో విసిగిపోయిన వైసీపీ నేతలు ఆయనపై ఒక్కొక్క చర్యకు సిద్ధం అవుతున్నారు.

    Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

    కొద్దిరోజుల క్రితం షోకాజు నోటీసులు జారీ చేయడంతో పాటు, ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించాలని, లోక్ సభ స్పీకర్ ని కోరారు. అలాగే రఘురామ కృష్ణం రాజును పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ చైర్మన్ గా తొలగించాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రెండు అంశాలపై స్పీకర్ నిర్ణయం పెండింగ్ లో ఉంది. తాజాగా ఎంపీ రఘురామ కృష్ణం రాజు లోక్ సభలోని సీటు నంబర్ మార్చివేశారు. ఆయనకు గతంలో కేటాయించిన సీటు నంబర్ 379 ని తొలగించి, 445 నంబరు సీటును కేటాయించారు. రఘురామ కృష్ణం రాజు సీటు నంబర్ 379ని రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన మార్గాని భరత్ కి కేటాయించారు.

    దీనితో వైసీపీ పార్టీలో ఆయన స్థానం, స్థాయి తగ్గించినట్లు అయ్యింది. బీజేపీ అండ ఉంటుందని దూకుడు చూపుతున్న రఘురామ కృష్ణం రాజుకు ఎల్లవేళలా వారి తోడు ఉంటుందని ఎటువంటి గ్యారంటీ లేదు. వైసీపీ పార్టీతో గొడవను అంతకంతకూ పెద్దది చేసుకుంటున్న ఆయనకు, బీజేపీ హ్యాండిస్తే పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. బీజేపీది ఎప్పుడూ సంకీర్ణ ప్రభుత్వమే గత రెండు పర్యాయాలు మాత్రం సంపూర్ణ మద్దతు తెచ్చుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2024 ఎన్నికలు బీజేపీకి అంత సులభం కాదు. ప్రభుత్వ ఏర్పాటులో స్థానిక పార్టీల మద్దతు తప్పనిసరి కావచ్చు. అలాంటప్పుడు జగన్ ని కాదని ఒంటికాయ శొంఠికొమ్ము కృష్ణం రాజుకు ప్రాధాన్యత ఇస్తారనే గ్యారంటీ లేదు. కాబట్టి ఇకనైనా రాజుగారు ఇగోలు వదిలేసి కాంప్రమైజ్ అయితే బెటర్ అని నిపుణుల సూచన. లేదంటే భవిష్యత్తులో ఫేటే మారిపోవచ్చు.
    Also Read: గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా?