https://oktelugu.com/

వలసలతో ఏపీకి పెరగనున్న కరోనా ముప్పు..!

కరోనా నగరాలను ఖాళీ చేస్తుంది. ఉపాధి లేక కొందరు, కరోనా భయంతో మరికొందరు సొంత ఊళ్లకు పయనం అవుతున్నారు. మన పొరుగున ఉన్న హైదరాబాద్, చెన్నై మరియు బెంగుళూరు నగరాలలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. విపరీతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కారణంగా బెంగుళూరు నగరంలో ఒక వారం కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. చెన్నై సిటీలో పాక్షికంగా, అధిక కేసులు ఉన్న ప్రాంతాలలో పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లో […]

Written By: , Updated On : July 19, 2020 / 03:42 PM IST
Follow us on

Corona threat to AP
కరోనా నగరాలను ఖాళీ చేస్తుంది. ఉపాధి లేక కొందరు, కరోనా భయంతో మరికొందరు సొంత ఊళ్లకు పయనం అవుతున్నారు. మన పొరుగున ఉన్న హైదరాబాద్, చెన్నై మరియు బెంగుళూరు నగరాలలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. విపరీతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కారణంగా బెంగుళూరు నగరంలో ఒక వారం కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. చెన్నై సిటీలో పాక్షికంగా, అధిక కేసులు ఉన్న ప్రాంతాలలో పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు స్వచ్చంధంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.

Also Read: కరోనాతో సీనియర్ నటుడి మృతి

కాగా ఒక్క హైదరాబాద్ నగరం నుండే 35 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లోని సొంతిళ్లకు చేరినట్లు సమాచారం అందుతుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే చెన్నై, బెంగుళూరు నగరాల నుండి కూడా ఎక్కువ మొత్తంలో ఉద్యోగులు, కూలీలు ఆంద్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తున్నారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా అధికంగా ఉన్న నగరాల నుండి వస్తున్న వీరిలో, ఎంత మంది వైరస్ మోసుకువచ్చారో ఎవరికి తెలియదు. ప్రాథమిక నిర్ధారణలో నెగెటివ్ వచ్చినవారికి కొద్దిరోజుల తరువాత పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.

Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో 3,963 మంది కరోనా బారిన పడ్డారు. దీనితో ఆంధ్రాలో కరోనా సోకిన వారిక సంఖ్య 44,609 కి చేరింది. 22,260 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇతర నగరాల నుండి వచ్చే వారిని గ్రామసచివాలయ సిబ్బంది అయిన వాలంటీర్స్, ఆశా వర్కర్స్ ద్వారా ట్రేస్ అవుట్ చేయడంతో పాటు కరోనా టెస్టులు నిర్వహించడంతో కరోనా వైరస్ ని కొంత వరకు కట్టడి చేయగలుతున్నారు. నిన్నటి నుండి విధుల్లోకి వచ్చిన సంజీవని మొబైల్ కరోనా టెస్టింగ్ వాహనాలు కరోనాను అరికట్టడంలో విప్లవాత్మక ఫలితాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.