వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

కొద్ది రోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించుకున్నందుకు తొలి మూల్యం చెల్లించుకున్నారు. లోక్ సభలో ఆయన సీటును మార్చడంలో వైసీపీ ఎంపీలు విజయం సాధించారు. గతంలో 379 నెంబరు సీటు కేటాయించగా ఇప్పుడు 445 నెంబరు సీటును కేటాయించారు. దీంతో రఘురామ కృష్ణంరాజు చివరి వరుసలోకి వెళతారు. లోక్ సభలో అత్యధికంగా పర్యాయాలు మాట్లాడిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లో కెక్కి ఉత్తమ పార్లమెంటేరియన్ అనిపించుకున్నారు. పార్టీకి […]

Written By: Neelambaram, Updated On : July 19, 2020 12:39 pm
Follow us on

కొద్ది రోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించుకున్నందుకు తొలి మూల్యం చెల్లించుకున్నారు. లోక్ సభలో ఆయన సీటును మార్చడంలో వైసీపీ ఎంపీలు విజయం సాధించారు. గతంలో 379 నెంబరు సీటు కేటాయించగా ఇప్పుడు 445 నెంబరు సీటును కేటాయించారు. దీంతో రఘురామ కృష్ణంరాజు చివరి వరుసలోకి వెళతారు. లోక్ సభలో అత్యధికంగా పర్యాయాలు మాట్లాడిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లో కెక్కి ఉత్తమ పార్లమెంటేరియన్ అనిపించుకున్నారు. పార్టీకి తలనొప్పిగా తయారైన ఆయన ఇప్పుడు లోక్ సభలో ప్రాధాన్యత లేని వెనుక వరుసలోకి చేరారు.

Also Read: గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎంపీ రాఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు కొద్ది రోజుల కిందట స్పీకర్ ఓం బిర్లాకు వినతి ప్రతాన్ని సమర్పించారు. అంతకు ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుకు సమాధానం ఇవ్వని ఎంపీ లేఖ ఆధారంగా మరికొన్ని కొత్త సమస్యలను పార్టీ మీదకు తెచ్చిపెట్టారు. ఎన్నికల సంఘానికి పార్టీ పేరు విషయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పార్టీ ఢిల్లీ హై కోర్టు నుంచి నోటీసులు అందుకుంది. దీంతో కృష్ణంరాజు విషయంలో పార్టీ ఆచీతూచీ వ్యవహరిస్తోంది. నేరుగా పార్టీ నుంచి తొలగిస్తే మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉందని భావించి అనర్హత పిటీషన్ దాఖలు చేయించారు.

Also Read: నర్సాపురం ఎంపీ బరిలో సినీ నటుడు

సీటు మార్పిడి అంశంపై స్పందించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు సింహం కూర్చున్న సీటే సంహాసనమంటూ ట్విట్ చేశారు. సభలో ఎక్కడ కూర్చున్నా తన గళం గతంలో వినిపించినట్లుగానే వినిపిస్తానని పేర్కొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు అందుకున్న తనకు దక్కిన సముచిత స్థానమని చెప్పుకొచ్చారు. అనర్హత పీటీషన్ తో ఏమీ చేయలేకపోయి ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు. అయినా తాను పార్టీని వీడేది లేదని స్పటం చేశారు.