https://oktelugu.com/

బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. రూ.40,000 వేతనంతో..?

ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 60 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎగ్జిమ్ బ్యాంక్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. Also Read: పరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వారికి మాత్రమే..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2020 / 04:58 PM IST
    Follow us on


    ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 60 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎగ్జిమ్ బ్యాంక్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

    Also Read: పరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వారికి మాత్రమే..?

    https://www.eximbankindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా 2020 సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక కావడం జరుగుతుంది.

    Also Read: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే..?

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 40,000 రూపాయలు వేతనం రూపంలో లభిస్తుంది. 2020 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నాటికి 25 సంవత్సరాలలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీలకు మూడేళ్లకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో సడలింపులు ఉన్నాయి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది. హ్యూమ‌న్ రిసోర్సెస్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా, ప్రాజెక్ట్ ట్రేడ్, కార్పొరేట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    2020 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి.