https://oktelugu.com/

వ్యాక్సిన్లపై ప్రధాని మోడీ సంచలన నిర్ణయం

దేశంలో తయారైన మేడిన్ ఇండియా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్ తో కలిసి హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఈ వ్యాక్సిన్ ను రూపొందించింది. అయితే భారత ప్రభుత్వం తయారు చేసినా కూడా భారత్ బయోటిక్ కంపెనీ నత్తనడకన ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లు దేశ అవసరాలను తీర్చలేకపోతున్నాయి.. ఆ సంస్థ ఉత్పత్తి సరిపోవడం లేదు. దీంతో దేశంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. చాలా పక్కదారి పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే ప్రధాని మోడీ కీలక […]

Written By:
  • NARESH
  • , Updated On : June 2, 2021 / 06:10 PM IST
    Follow us on

    దేశంలో తయారైన మేడిన్ ఇండియా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్ తో కలిసి హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఈ వ్యాక్సిన్ ను రూపొందించింది. అయితే భారత ప్రభుత్వం తయారు చేసినా కూడా భారత్ బయోటిక్ కంపెనీ నత్తనడకన ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లు దేశ అవసరాలను తీర్చలేకపోతున్నాయి.. ఆ సంస్థ ఉత్పత్తి సరిపోవడం లేదు. దీంతో దేశంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. చాలా పక్కదారి పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

    కోవాగ్జిన్ డిమాండ్ కు సరిపడా ఉత్పత్తిని చేయలేకపోవడంతో ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు వ్యాక్సిన్ల ఫార్ములాను జాతీయం చేయాలని అన్ని కంపెనీలకు ఇచ్చి వాటిని ఉత్పత్తి చేయాలని ఏపీ సీఎం జగన్ సహా చాలా మంది నుంచి డిమాండ్లు వస్తున్న దృష్ట్యా మోడీ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.

    ప్రజలకు వ్యాక్సిన్లు వేయడమే లక్ష్యంగా  ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. దేశంలో కొరత తీవ్రంగా ఉన్న వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్ ఫార్ములాను మరో ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోడీ సర్కార్ భారత్ బయోటెక్ ను పక్కనపెట్టి ఈ నిర్ణయం తీసుకుంది.

    హ్యాప్కిన్ బయో ఫార్మాకు 22.8 కోట్ల డోసులను తయారు చేయాలని కోవాగ్జిన్ ఫార్ములాను అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యాక్సిన్ ఉత్పత్తిని ఇలా పెంచి దేశ ప్రజలందరికీ అందించేందుకు ఈ జగన్ సలహాను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

    వ్యాక్సిన్ ఫార్ములాను హ్యాప్సిన్ బయో ఫార్మకు ఇచ్చి కేంద్రం 64 కోట్ల రూపాయలను, మహారాష్ట్ర ప్రభుత్వం 94 కోట్లను ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ప్రభుత్వాలు పెట్టుబడిగా సదురు సంస్థకు ఇవ్వనున్నాయి.

    కరోనా సెకండ్ వేవ్ కు ముందే ఈ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడింత కష్టాలు వచ్చి ఉండేవి కాదని పలువురు సూచిస్తున్నారు. కేంద్రం తయారు చేసిన వ్యాక్సిన్ ఫార్ములాను అన్ని తయారీ సంస్థలకు ఇచ్చి రోజుకు లక్షలు ఉత్పత్తి చేస్తే దేశ అవసరాలు తీర్చితే ఈ కష్టాలుండేవి కాదు. తద్వారా దేశంలో వ్యాక్సినేషన్ కు కొరత ఉండదని.. ఇతర దేశాలకు పంచేంత ఉత్పత్తి చేయడం సాధ్యమయ్యేదంటున్నారు . ఇప్పటికైనా మోడీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై ప్రశంసలు కురిస్తున్నాయి.