
ఐసీసీ బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు ర్యాంకులను నిలబెట్టుకున్నారు. కోహ్లీ ఖాతాలో 857 రేటింగ్ పాయింట్లు ఉండగా, రోహిత్ ఖాతాలో 825 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అగ్రస్థానంలో పాకిస్థాన్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ 865 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో భారత్ పేసర్ బుమ్రా 690 రేటింగ్స్ తో ఐదో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా ఉన్నాడు.