https://oktelugu.com/

జగన్ ను ఎదురించిన జడ్జి మరో జైలుకు.. కారణమిదే!

ఆంధ్రలో ఏకపక్ష రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రభుత్వంపై మాట్లాడితే చాలు వారిని ఏదో రకంగా జైలుకు పంపించడమే. ఇదే విధంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, జడ్జి రామకృష్ణ జైలు పాలయ్యారు. జగన్ పై విమర్శలు చేసినందుకే కటాకటాలపాలయ్యారు. ఎంపీకి బెయిలొచ్చినా జడ్జి రామకృష్ణ జైలులోనే ఉన్నారు. దీంతో ఏపీలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై తిరగబడితే అంతే సంగతి. జైలుకు వెళ్లడమే తరువాయి. చిత్తూరు జైల్లో తన తండ్రికి ప్రాణహాని ఉందని జడ్జి కుమారుడు వంశీకృష్ణ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 2, 2021 6:11 pm
    Follow us on

    ఆంధ్రలో ఏకపక్ష రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రభుత్వంపై మాట్లాడితే చాలు వారిని ఏదో రకంగా జైలుకు పంపించడమే. ఇదే విధంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, జడ్జి రామకృష్ణ జైలు పాలయ్యారు. జగన్ పై విమర్శలు చేసినందుకే కటాకటాలపాలయ్యారు. ఎంపీకి బెయిలొచ్చినా జడ్జి రామకృష్ణ జైలులోనే ఉన్నారు. దీంతో ఏపీలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై తిరగబడితే అంతే సంగతి. జైలుకు వెళ్లడమే తరువాయి.

    చిత్తూరు జైల్లో తన తండ్రికి ప్రాణహాని ఉందని జడ్జి కుమారుడు వంశీకృష్ణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోపాలస్వామికి ఫిర్యాదు చేయడంతో పీలేరు సబ్ జైలుకు తరలించారు. దీంతో రామకృష్ణకు అక్కడ కూడా రక్షణ ఉంటుందో లేదోనని పలువురు చర్చించుకుంటున్నారు. తీర్పులు చెప్పే జడ్జిలకే సేఫ్టీ లేకుండా పోతుందని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.

    తన తండ్రి రామకృష్ణకు ప్రాణ హాని ఉందని కుమారుడు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో భయం నెలకొంది. ఆయనను మరో ఖైదీ బ్యారక్ కు వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సదరు ఖైదీ దగ్గర కత్తి కూడా దొరికిందని లేఖలో పేర్కొన్నారు. దీంతో జడ్జికి సైతం ప్రాణహాని ఉందని నమ్మాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

    లేఖపై స్పందించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ రామకృష్ణకు ప్రాణహానిపై ఏం చెబుతారని ప్రభుత్వ తరఫు న్యాయవాదని ప్రశ్నించారు. రామకృష్ణకు మరో బ్యారక్ కు మార్చినట్లు వెల్లడించారు. దీంతో ఆయనను పీలేరు సబ్ జైలుకు తరలింపు విషయం తెలిసింది. పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

    ముఖ్యమంత్రి జగన్ తల నరుకుతానని ఓ చానల్ చర్చలో సస్పెండైన జడ్జి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రామకృష్ణపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేయడం, ఏప్రిల్ లో అరెస్టు చేయడం చకాచకా జరిగిపోయాయి. జైల్లో కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. జైల్లో తనకు ప్రాణహాని ఉందంటూ గత మూడు రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పీలేరు సబ్ జైలుకు తరలించారు. మరి అక్కడైనా కుదురుగా ఉంటారా? లేక మరో కొత్త సమస్యలు సృష్టిస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.