Pawan Kalyan On Modi: పవన్ కళ్యాణ్ ఇటీవలే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ‘వారాహి విజయ యాత్ర’ మొదటి విడత ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మొదటి విడత కి జనాలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. దారిపొడుగునా పవన్ కళ్యాణ్ కి మహిళలు హారతులు పడుతున్నారు.ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని జనసేన పార్టీ శ్రేణులు కూడా ఊహించలేదు. మరో రెండు సభలతో మొదటి విడత యాత్ర ముగుస్తుంది అంటేనే అభిమానులకు ఏదోలా ఉంది.
అంత మధురమైన జ్ఞాపకాలను అభిమానులకు పంచుతూ ఈ వారాహి యాత్ర ముందుకు కొనసాగుతుంది. ఇక పోతే నేటితో ఈ వారాహి విజయ యాత్ర రాజోలు కి చేరుకుంది. జనసేన పార్టీ 2019 ఎన్నికలలో గెలుచుకున్న ఏకైక MLA స్థానం ఇదే. ఇప్పుడు ఆ MLA కూడా జనసేన పార్టీ తో లేడు, వైసీపీ తో ఉన్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ నేడు రాజోలు లో ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు అమిత్ షా లతో తనకి ఉన్న సాన్నిహిత్య సంబంధం గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ నేను ఏదైనా సమస్యలపై మాట్లాడాలంటే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారిని అడిగితే వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతుంది.నేను నా సుఖాల కోసం అడగను కానీ, మీ సమస్యల కోసం కచ్చితంగా అడుగుతాను. మొన్న వైజాగ్ లో మా పై వైసీపీ చేసిన అరాచకాల గురించి చెప్పుకోవాలి అని నోటి దాకా వచ్చింది. కానీ నేను జనసేన పార్టీ కి అధినేత ని, ఏదైనా నేనే ఆ సమస్యలను తేల్చుకుంటాను, కంప్లైంట్ చెయ్యడం ఇష్టం లేదు. మొన్న విశాఖ లో జరిగిన సంఘటన గురించి మోడీ గారు అడిగిన చెప్పలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.