Varahi Vijaya Yatra In Razole: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్న చర్చ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ‘వారాహి విజయ యాత్ర’. ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్న దీని గురించే చర్చ. ‘హలో ఏపీ..బై బై వైసీపీ’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్లోగన్ మాస్ లో ఒక రేంజ్ లో రీచ్ అయ్యింది. 2014 ఎన్నికలలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ‘ కాంగ్రెస్ హటావో – దేశ్ బచావో’ అని ఇచ్చిన ఒక స్లోగన్ నేషనల్ వైడ్ గా పాపులారిటీ ని సాధించింది.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ఉభయ గోదావరి జిల్లాల యాత్ర లో తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు సభతో నేటి ముగిసింది. రేపు పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టి నర్సాపురం లో భారీ బహిరంగ సభని నిర్వహించబోతున్నాడు, అనంతరం భీమవరం సభతో ‘వారాహి విజయ యాత్ర’ మొదటి విడత ముగుస్తుంది.
ఇక నేడు పవన్ కళ్యాణ్ రాజోలు సభలో ఇచ్చిన ప్రసంగం హైలైట్ గా నిల్చింది. ఈ ప్రసంగం లో ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాము. ఆయన మాట్లాడుతూ ‘ 2014 వ సంవత్సరం లో నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు ఒక్కటే చెప్పాను, ఇప్పుడు నాతో ఉన్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఎలాంటి వాళ్ళు అయ్యుండాలంటే, జనసేన పార్టీ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేసేలా ఉండాలి. అలా 150 మందితో ప్రారంభమైన జనసేన పార్టీ, నేడు ఒక్క రాజోలు నియోజగవర్గం లోనే, 10 వేల మందికి పైగా క్రియాశీలక సభ్యులను దక్కించుకుంది. మన పార్టీ ఏ స్థాయికి ఎదిగింది అనేందుకు ఇదే ఉదాహరణ’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 500 రూపాయిలు చెల్లించి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఒకవేళ కార్యకర్తలు దురదృష్టం కొద్దీ ఎవరైనా చనిపోతే, వాళ్లకు 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం చేసి, ఆ కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటుంది.