Pawan Kalyan Varahi Yatra: కోట్లాది మంది అభిమానులు మరియు కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ నేడు రాజోలు సభతో తూర్పు మరియు కోనసీమ జిల్లాలలో ముగిసింది. ఇక రేపు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెడతాడు. అక్కడ నర్సాపురం మరియు భీమవరం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ సభలను నిర్వహిస్తారు. ఈ రెండు సభలు జనసేన పార్టీ కి ఎంతో ప్రతిష్టాత్మకం కాబోతుంది.
ఇక భీమవరం లో నిర్వహించబోయే సభలో, పవన్ కళ్యాణ్ తాను ఎక్కడి నుండి పోటీ చెయ్యబోతున్నాడు అనేది చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇక పోతే నేడు పవన్ కళ్యాణ్ రాజోలు లో మాట్లాడిన మాటలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న ప్రతీ తప్పుని ఎత్తి చూపుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కేవలం ఆయన అభిమానులకు మాత్రమే కాదు, న్యూట్రల్ ఓటర్లను కూడా ఎంతో ఆకట్టుకుంది.
ఇక పోతే నేడు పవన్ కళ్యాణ్ రాజోలు సభలో మాట్లాడూతూ ‘ వైసీపీ పార్టీ చేస్తున్న తప్పులను చదివి చదివి నా కంటికి సైట్ కూడా వచ్చేసింది. 4 సంవత్సరాల్లో ఎందుకు స్థానిక యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేయలేదు, ఆయిల్ కంపెనీల్లో ఎందుకు ఉపాధి వచ్చేలా చేయలేదు? ఇక్కడి నిధులు తీసుకెళ్తున్నప్పుడు కనీసం ఉపాధినైనా ఇవ్వాలి కదా? వైసీపీ ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదు? ఎందుకు భాధ్యత లేదు.దళిత విద్యార్థులకు మేనమామ అని చెప్పుకుంటూ, 24 దళిత పథకాలు ఎందుకు రద్దు చేశారు, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకానికి జగన్ విదేశీ విద్యా దీవెన అని ఎందుకు పేరు మార్చారు?, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు కూడా సరిపోదు. ఈ కోనసీమ ప్రాంతానికి వైసీపీ పార్టీ ఏమి చెయ్యలేదు, ఇక్క వాళ్లకు ఒక్క సీటు కూడా రాకుండా ఉండేలా చెయ్యడం నా బాధ్యత గా తీసుకుంటాను’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.