Presidential Election: దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి సంతరించుకుంది. ఇప్పుడున్న రాష్ట్రపతి పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర కసరత్తు చేస్తోంది. అయితే ఎన్డీయేకు మెజారిటీ బలం ఉన్నా అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చినా.. అభ్యర్థి ఎవరనేది నిర్ణయించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ మరోసారి భేటి కానుంది. అటు విపక్షాలు సైతం అభ్యర్థి విషయంలో ఫైనల్ డెసిషన్ కు రాలేకపోతున్నారు. దీంతో అసలు రాష్ట్రపతి పదవి కోసం ఎవరూ పోటీలో ఉంటారన్న విషయం సస్పెన్ష్ గానే ఉండిపోతోంది.
ఎన్డీయే తరుపున ఇప్పటికే చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కొన్ని రోజులుగా ద్రౌపది ముర్ము, అనసూయ ఉకే తో పాటు పలువురిని అనుకుంటున్నారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అవకాశం ఇస్తారని అనుకున్నారు. వెంకయ్యానాయుడిని బరిలో దింపితే దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న విమర్శలకు అడ్డుచెప్పవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ దళిత వర్గానికి చెందిన వారు. ఈసారి గిరిజన వర్గానికి చెందిన మహిళకు అవకాశం ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ పార్లమెంటరీ కమిటీ తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే నేడు జరిగే సమావేశంలో అభ్యర్థి ఎవరనేది తేలనుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
Also Read: Samantha- Naga Chaitanya: హీరోయిన్ తో నాగ చైతన్య ఎఫైర్… సమంత సంచలన ట్వీట్, ఏకంగా ఎదురుదాడి!
అటు విపక్షాలు సైతం అభ్యర్థి ఎంపిక విషయంలో నిర్దారణకు రాలేకపోతున్నారు. శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ తదితర నేతల పేర్లు అనుకున్నారు. కానీ వారు పోటీలో ఉండడానికి నిరాకరించడంతో మరోసారి అభ్యర్థి ఎంపిక విషయంలో తలమునకలయ్యారు. అయితే గతంలో వాజ్ పేయికి సన్నిహితుడిగా ఉన్న యశ్వంత్ సిన్హా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఎన్డీయే పార్టీకి చెందిన ఆయనను బరిలో దింపడం ద్వారా ఆ కూటమిని ఇరుకున పెట్టే అవకాశం ఉందని భావిస్తోంది. అయితే విపక్షాలు సైతం నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్డీయేకు మెజారిటీ ఉంది. కానీ బీజేపీ పూర్తి మెజారిటీ కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు పార్టీల సపోర్టు తీసుకోనుంది. తమిళనాడులోని అన్నాడీఎంకే, ఏపీలోని వైసీపీ మద్దతుతో గట్టెక్కాలని చూస్తోంది. చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా మద్దతు పార్టీలను అక్కున చేర్చుకుంటోంది. అయితే మెజారిటీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా అభ్యర్థి ఎంపిక విషయంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తపడుతున్నారు. అందుకే చాలా సమయం తీసుకున్నా సరే.. సరైన అభ్యర్థిని నియమించాలని చూస్తున్నారు. కాగా నేడు జరిగే సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖ నేతలు హాజరు కానున్నారు.
Also Read:Modi Comments on Agneepath scheme: అగ్నిపథ్ పై లోపల ఉన్నదంతా కక్కేసిన మోడీ..