పంజాబ్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మంచి పేరుంది. ఏ రాష్ర్టంలో ఎలక్షన్లు జరిగినా ఆయన పేరు వినిపిస్తుంది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో ఆయన చూపిన మార్గంలో నడిచి విజయ తీరాలకు చేరాయి పార్టీలు. ఇప్పుడు మరో రాష్ర్టం అదే దారిలో నడిచేందుకు సమాయత్తమవుతోంది. పంజాబ్ రాష్ర్టంలో జరిగే ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడానికి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించి ఆ పార్టీ అధికారంలోకి […]

Written By: Srinivas, Updated On : May 29, 2021 7:27 pm
Follow us on

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మంచి పేరుంది. ఏ రాష్ర్టంలో ఎలక్షన్లు జరిగినా ఆయన పేరు వినిపిస్తుంది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో ఆయన చూపిన మార్గంలో నడిచి విజయ తీరాలకు చేరాయి పార్టీలు. ఇప్పుడు మరో రాష్ర్టం అదే దారిలో నడిచేందుకు సమాయత్తమవుతోంది. పంజాబ్ రాష్ర్టంలో జరిగే ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడానికి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గెలుపు ఖాయమని భావించినా ప్రశాంత్ కిషోర్ ప్రణాళికతోనే పార్టీ విజయతీరాలకు చేరిందనే విషయం తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పంజాబ్ ఎన్నికలపై దృష్టి సారించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల తర్వాత పంజాబ్ కు షిఫ్ట్ అవుతున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్   అమరీందర్  సింగ్ ప్రశాంత్ కిషోర్ ను ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం పంజాబ్ లో పని ప్రారంభించింది.

పంజాబ్  లో 117 స్థానాలున్నాయి. ఇక్కడ మరోసారి కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉన్నాయి. రాష్ర్టంలో బీజేపీ పరిస్థితి అధ్వానంగా మారింది. రైతు చట్టాలతో తన ప్రతిష్టను దిగజార్చుకుంది. మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ సైతం వైదొలగడంతో బీజేపీ ఒంటరిగా పో టీ చేస్తోంది. దీంతో ప్రశాంత్ కిషో ర్ పంజాబ్ లో తన హవా చూపెట్టాలని  భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తూ తన రేటింగ్ ను పెంచుకుంటున్నారు.