Post Office Super Scheme : దీనికి ప్రధాన కారణం బ్యాంకుల కంటే కూడా పోస్ట్ ఆఫీస్ లో ఉండే పథకాలపై వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి ప్రభుత్వ హామీతో ఉండే పథకాలు కాబట్టి మీ డబ్బు ఇందులో చాలా సురక్షితంగా ఉండడమే కాకుండా మీకు మెచ్యూరిటీ సమయంలో అధిక రాబడి కూడా అందుతుంది. పోస్ట్ ఆఫీస్ ప్రస్తుతం అందిస్తున్న పథకాలలో కిసాన్ వికాస్ పాత్ర పథకం కూడా ఒకటి. మీరు ఈ పథకంలో కేవలం నాలుగు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 115 నెలలలో మీరు ఎంత రాబడి అందుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది కూడా తమకు వచ్చిన నెల సంపాదనలో కొంత పొదుపు చేసి దానిని వెంటనే పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పథకాలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళు కేవలం కొన్ని నెలలలోనే అద్భుతమైన రాబడిని అందుకుంటారు. కొంత మొత్తంలో దీర్ఘకాలంలో మీరు పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడి పెట్టడం వలన ఎక్కువ మొత్తంలో సేవింగ్స్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మీరు భారీ నిధిని ఏర్పరచుకోవచ్చు.
Also Read : కేవలం 5 ఏళ్లలో రూ.14 లక్షలు పొందొచ్చు.. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సూపర్ డూపర్ పథకం ఇదే..
మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న కిసాన్ వికాస్ పాత్ర యోజన పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కేవలం 115 నెలలలో మీరు భారీగా వడ్డీని అందుకోవచ్చు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసేది పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఎటువంటి మార్కెట్ నష్టాలను మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పాత్ర పథకానికి భారీ వడ్డీ రేటులను అందిస్తుంది. ఇందులో మీరు 7.5% వడ్డీ రేటు అందుకోవచ్చు.మీ పిల్లలకు 10 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకంలో ఎకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు.
కనీసం గా మీరు ఈ పథకంలో రూ.1000 రూపాయల నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు ఇందులో ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేసినా కూడా అది 115 నెలల తర్వాత రెట్టింపు అవుతుందని చెప్పవచ్చు. ఉదాహరణకు మీరు ఈ పథకంలో రూ.4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న వడ్డీ రేటు 7.5% ప్రకారము మీరు 115 నెలలలో రెట్టింపు పొందవచ్చు. అంటే మీరు పెట్టిన నాలుగు లక్షల పెట్టుబడికి మీరు 115 నెలల తర్వాత రూ.8 లక్షల రూపాయలు అందుకోవచ్చు. అంటే మీకు నాలుగు లక్షలకు మరో నాలుగు లక్షలు వడ్డీగా వస్తుంది.