Post Office Super Scheme: చాలామంది తమ డబ్బును పొదుపు చేసి వాటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి రిటర్న్స్ పొందే పథకాలలో పెట్టడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. అటువంటి వారి కోసం ప్రభుత్వ హామీ ఉన్న పోస్ట్ ఆఫీస్ ఇప్పటివరకు అనేక పథకాలను అమలు చేసింది. పోస్ట్ ఆఫీస్ లో ప్రస్తుతమున్న ఒక బెస్ట్ రికరింగ్ డిపాజిట్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీసు ప్రజల కోసం ఆర్డి పథకాన్ని అమలు చేసింది. ఎటువంటి రిస్క్ లేకుండా రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు మంచి రాబడి పొందవచ్చు. నెలకు కేవలం 100 రూపాయల నుంచి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా మీరు రికరింగ్ డిపాజిట్ పథకంలో ఖచ్చితమైన రిటర్న్స్ అందుకోవచ్చు. ఈ పథకంలో వడ్డీ ప్రయోజనం కూడా మీకు స్థిరంగా ఉంటుంది. ఈ పథకము మెచ్యూరిటీ కాల పరిమితి కేవలం ఐదేళ్లు. మూడేళ్లు నిండిన తర్వాత మీరు మధ్యలో కూడా ఈ పథకంలో నగదు తీసుకోవచ్చు.
Also Read: 30 years of grudge against CBI: సిబిఐ మీద 30 ఏళ్ల పగ.. ఈ రైల్వే మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే?
కానీ ఆ సమయంలో వడ్డీ తగ్గుతుందని గుర్తుపెట్టుకోవాలి. రుణం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో ఐదేళ్లలో రూ.14 లక్షల రాబడి పొందాలని అనుకుంటున్నాట్లయితే మీరు ప్రతి నెల రూ.20వేలు పొదుపు చేయాలి. ఈ విధంగా మీరు ప్రతి నెల 20000 ఐదేళ్లు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు చేసే మొత్తం రూ.12,00,000 అవుతుంది. మీకు వడ్డీ రూపంలో రూ.2,27,320 లభిస్తుంది. మొత్తం కలిపి మీకు మెచ్యూరిటీ సమయానికి రూ.14,27,320 లభిస్తాయి. ఒకవేళ భవిష్యత్తులో వడ్డీరేట్లలో మార్పులు జరిగినట్లయితే మెచ్యూరిటీ సమయానికి మీకు వచ్చే రాబడి దానికి అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో మీకు 6.7% వడ్డీ లభిస్తుంది.
మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలని భావించినట్లయితే ముందుగా మీరు మీకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి రికరింగ్ డిపాజిట్ ఎకౌంటు ఫామ్ నింపాలి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాగే ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫోటో అందించాల్సి ఉంటుంది. అలాగే నామిని పేరును కూడా మీరు అందించాలి. ఈ పథకంలో మీరు కనీసం వంద రూపాయలతో ఖాతా ఓపెన్ చేయవచ్చు. ప్రతినెల కొంత డబ్బులు పొదుపు చేసే వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నారు రికరింగ్ డిపాజిట్ పథకం చాలా మంచి ఆప్షన్.