Post Office : ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని పోస్టల్ పేమెంట్ బ్యాంక్ తో పాటు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కలిసి పట్టణ మరియు పల్లె ప్రజలకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం అతి తక్కువ ప్రీమియంతో వాళ్లకు ఎక్కువ భద్రత కల్పిస్తూ తక్కువ ఖర్చుతో అమలులోకి తెస్తున్నాయి. ఇండియా పోస్ట్ మరియు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో సామాన్యులకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకొని వాళ్లకు ప్రత్యేక ప్రమాద బీమా పథకం అందిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా సబ్ డివిజన్ నకిరేకల్ పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన పోస్ట్ మాస్టర్ సుధాకర్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు. దీనికి 18 నుంచి 65 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. వాళ్లకు తమ మొబైల్ నెంబర్ తో పాటు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ప్రజలందరికీ లాభం చేకూర్చేలా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అలాగే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో అందిస్తున్న వ్యక్తిగత ప్రమాద బీమా పథకం రూపొందించబడింది.
ఈ పాలసీలో సామాన్య ప్రజల కోసం అతి తక్కువ ప్రీమియంతో ఎన్నో రకాల ఆరోగ్య మరియు ప్రమాద భీమా ప్రయోజనాలను అందిస్తున్నారు. 2 వేరియంట్లలో ఈ పాలసీ అందుబాటులో ఉంది. 550 రూపాయల ప్రీమియంతో ఇందులో మీరు 10 లక్షల కవరేజ్ పొందవచ్చు. అలాగే రెండవది 350 రూపాయల ప్రీమియంతో మీరు ఐదు లక్షల కవరేజ్ పొందుతారు. ఆసుపత్రి ఖర్చులు, తాత్కాలికా లేదా శాశ్వత వికలాంగత భీమ, మాతృత్వ ప్రయోజనాలు, అంబులెన్స్ ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు, యాక్సిడెంట్ డెత్, పర్మనెంట్ డిజేబులిటీ వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.
Also Read : పోస్ట్ ఆఫీస్ లో ఈ అద్భుతమైన పథకంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు..
అన్నిటికన్నా కూడా మీకు ఈ పాలసీలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 10 లక్షల పాలసీకి హాస్పిటల్ నిబంధన ఖర్చులు 500 రూపాయలు. 10 లక్షల పాలసీకి మీకు యాక్సిడెంట్ డెత్ క్లైమ్ అయితే కనుక ఒక లక్ష రూపాయలు అలాగే పిల్లల చదువు కోసం 10 లక్షల పాలసీకి ఒక లక్ష రూపాయలు ఉన్నాయి. మాతృత్వ ప్రయోజనం కోసం 2500 ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ మీరు 5 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన లేదా పాలసీ కట్టిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినట్లయితే అతని నామినీకి ఐదు లక్షల బీమా అందుతుంది.