Post Office Scheme : పోస్ట్ ఆఫీస్ లో మీరు ఒక పథకంలో కేవలం రెండు లక్షల రూపాయల పెట్టుబడితో ఏకంగా ఆరు లక్షల వరకు పొందవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తాము పొదుపు చేసిన డబ్బులను ఒక మంచి పథకంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. అటువంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ లో ఒక అద్భుతమైన పథకం అమలులో ఉంది. అయితే చాలామంది కూడా ఎక్కువ లాభం పొందాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి అని భావిస్తారు. కానీ పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పథకాలలో తక్కువ పెట్టుబడి తో కూడా అధిక లాభాలను అందుకోవచ్చు.
Also Read : తలైవాకు ప్రియురాలిగా, తల్లిగా, చెల్లిగా నటించిన ఒకే ఒక హీరోయిన్ ఎవరో తెలుసా…
పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు. ఇవి చాలా సురక్షితమైనవి కూడా. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో మీరు ఐదేళ్లు పెట్టుబడి పెట్టినట్లయితే ఎటువంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ కాల పరిమితులలో ఎఫ్డి లలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కాల పరిమితిని బట్టి వడ్డీ రేట్లు కూడా మారుతూ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ ఎఫ్ డి లో ఐదు ఏళ్ల కాల పరిమితికి 7.5% వడ్డీ రేటు ఉంటుంది. ఒకవేళ మీరు ఇందులో ఏడు లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే మెచ్యూరిటీ సమయానికి మీరు మొత్తం రూ.10,14,964 అందుకుంటారు. అంటే మీకు రూ.3,14,964 లాభం అందుతుంది. పోస్ట్ ఆఫీస్ లో ఎఫ్డీ లపై ఐదు ఏళ్ల కాల పరిమితికి 7.5% వడ్డీ రేటు రాబడిని అందిస్తున్నారు.
అయితే మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం మూడు రేట్లు పెరగాలంటే మీరు ఎఫ్డిని రెండు రెట్లు పొడిగించాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఎఫ్డి లో మీరు ఐదు ఏళ్లకు రెండు లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే మెచ్యూరిటీ సమయానికి మీరు మొత్తం రూ.2,89,990 పండుకుంటారు. ఆ తర్వాత మరోసారి ఎఫ్డిని 5 ఏళ్లకు పొడిగించుకోవాలి. అప్పుడు మీరు మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.4,20,470 పొందుతారు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఎఫ్డిని వచ్చే ఐదేళ్లకు ఒకసారి పొడిగించుకుంటూ ఉండాలి. మెచ్యూరిటీ సమయానికి రూ.6,09,370 లభిస్తుంది. అంటే మీరు ఇందులో రెండు లక్షలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలకు మార్చుకోవచ్చు. దీనికోసం మీకు 15 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.