Homeఎంటర్టైన్మెంట్Tinnu Anand: కుక్కలతో పెట్టుకున్న ప్రముఖ నటుడు.. లీగల్ నోటీసులు అందుకున్నాడు

Tinnu Anand: కుక్కలతో పెట్టుకున్న ప్రముఖ నటుడు.. లీగల్ నోటీసులు అందుకున్నాడు

Tinnu Anand: బాలీవుడ్‌ నటుడు టిన్ను ఆనంద్‌ వీధి కుక్కలను హాకీ స్టిక్‌తో కొట్టి బెదిరిస్తానని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ముంబైలోని తన హౌసింగ్‌ సొసైటీలో కుక్కలు మొరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కుక్కల సంరక్షకులను ఇంటికి తీసుకెళ్లాలని లేకపోతే తన కోపాన్ని ఎదుర్కోవాలని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ వ్యాఖ్యలు జంతు ప్రేమికులు, సామాజిక వేదికల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి, ఫలితంగా న్యాయవాది హౌసింగ్‌ సొసైటీకి లీగల్‌ నోటీసు జారీ చేశారు.

Also Read: నిరుడు ఛాంపియన్..ఈ ఏడు గ్రూప్ దశలోనే.. పాపం కోల్ కతా

ప్రముఖ సినీ నటుడు టిన్ను ఆనంద్‌. ముంబైలో తాను నివాసం ఉంటున్న వీధి కుక్కల బెడద పెరిగింది. వీధి కుక్కలు తన కుమార్తెతో సహా ఇతరులపై దాడి చేసిన సంఘటనలను ప్రస్తావిస్తూ వీధి కుక్కలను హాకీ స్టిక్‌తో కొట్టి బెదిరిస్తానని పేర్కొన్నాడు. సొసైటీలో కుక్కలు మొరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కుక్కల సంరక్షకులను ఇంటికి తీసుకెళ్లాలని లేకపోతే తన కోపాన్ని ఎదుర్కోవాలని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఆత్మరక్షణలో బెదిరింపులు చేసినట్లు సమర్థించుకున్నాడు. అయితే, హాకీ స్టిక్‌తో కొట్టడం వంటి హింసాత్మక బెదిరింపులు జంతు హింసను ప్రోత్సహిస్తాయని జంతు సంరక్షణ సంస్థలు ఆరోపించాయి. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో, తోటి నటులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. జంతు క్రూరత్వ నిరోధక చట్టం (PCA, 1960) కింద ఇటువంటి బెదిరింపులు నేరంగా పరిగణించబడతాయని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు.

లీగల్‌ నోటీసు డిమాండ్లు
న్యాయవాది జారీ చేసిన లీగల్‌ నోటీసు టిన్ను ఆనంద్‌పై అధికారిక హెచ్చరిక, సొసైటీలో వీధి జంతువుల పట్ల చట్టపరమైన బాధ్యతలపై అంతర్గత సలహా, జంతువులు మరియు సంరక్షకులపై హింసను నిరోధించే చర్యలను డిమాండ్‌ చేసింది. సొసైటీ నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోకపోతే, భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్‌ 503 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. వీధి జంతువుల సంరక్షణ, శాంతియుత సహజీవనం సొసైటీ బాధ్యతని నోటీసు నొక్కిచెప్పింది.

జంతు ప్రేమికుల ఆగ్రహం
ఆనంద్‌ వ్యాఖ్యలు జంతు సంరక్షణ కార్యకర్తలను కలవరపరిచాయి. వీధి కుక్కలు సమాజంలో భాగమని, వాటిని బెదిరించడం బదులు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల ద్వారా నియంత్రించాలని సూచించారు. ్కఉఖీఅ ఇండియా వంటి సంస్థలు సొసైటీలు జంతు సంరక్షణకు సహకరించాలని కోరాయి. సోషల్‌ మీడియాలో #JusticeForStreetDogs టట్ఛ్ఛ్టఈౌజటహ్యాష్‌ట్యాగ్‌తో ఈ విషయం విస్తతంగా చర్చనీయాంశమైంది.

సొసైటీ బాధ్యతలు
భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 51A(g) ప్రకారం, జంతువుల పట్ల కరుణ చూపడం పౌరుల బాధ్యత. బహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) మార్గదర్శకాల ప్రకారం, వీధి కుక్కలను తొలగించడం చట్టవిరుద్ధం. సొసైటీలు జంతు సంక్షేమ సంస్థలతో కలిసి వీధి కుక్కల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించాలి. టిన్ను ఆనంద్‌ వివాదం సొసైటీలలో జంతు సంరక్షణపై చర్చను రేకెత్తించింది.

టిన్ను ఆనంద్‌ స్పందన
ఆనంద్‌ తన వ్యాఖ్యలను ఆత్మరక్షణలో చేసినవిగా సమర్థించుకున్నాడు, కుక్కల దాడుల వల్ల తన కుటుంబం భయాందోళనకు గురైందని పేర్కొన్నాడు. అయితే, హింసాత్మక బెదిరింపులు చట్టవిరుద్ధమని, సమస్యను సొసైటీ నిర్వాహకులతో చర్చించి పరిష్కరించాల్సిందని నిపుణులు సూచించారు. ఆనంద్‌ ఇంకా అధికారిక క్షమాపణ విడుదల చేయలేదు, దీనితో విమర్శలు మరింత తీవ్రమయ్యాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular