Political Surveys in Telangana: తెలంగాణలో రాజకీయ డ్రామాలు జరుగుతున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ మైండ్ గేమ్ లు ఆడుతున్నాయి. అధికారం తమదంటే తమదే అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సర్వేల పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. అధికారం తమదంటే తమదే అని చెబుతున్నాయి. కానీ ఓటరు మదిలో ఏముందో ఎవరికి తెలుసు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.
ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాదనే విషయం తెలుస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతోంది. మరోవైపు బీజేపీ అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు సర్వేలు నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం తమదే అని టీఆర్ఎస్ చెబుతుంటే తామే అధికారం దక్కించుకుంటామని బీజేపీ వాదిస్తోంది. తాము రెండో స్థానంలో ఉంటామని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆత్మసాక్షి స్పష్టం చేస్తోందని చెబుతోంది.
Also Read: Getup Srinu- Yedukondalu: ఏడుకొండలు ఆరోపణలపై నోరు విప్పిన గెటప్ శ్రీను.. షాకింగ్ నిజాలు
బీజేపీ ఆరా అనే సంస్థ ద్వారా నిర్వహించిన సర్వేలో తామే రెండో స్థానంలో ఉంటామని చెబుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అన్ని సర్వేలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. కానీ ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాక అతడి మదిలో ఏ పార్టీ మెదిలితే ఆ పార్టీకే ఓటు వేసి వస్తాడు. అంతే కానీ ఈ బలాబలాలు ఈ సర్వేలు అన్ని వ్యర్థమే. పార్టీలు తమ ప్రభావం కోసమే ఈ సర్వేల బూటకాలు ఆడుతున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.
సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నాయి. పీకే సూచించిన సర్వేలో టీఆర్ఎస్ కొన్ని మార్పులు చేస్తే అధికారం సొంతమవుతుందని చెప్పడంతో ఆ దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. రేషన్ కార్డులు ఇస్తూ కొత్త పింఛన్లు విడుదల చేయాలని తేల్చింది. దీంతో ఆ దిశగా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. బీజేపీ కూడా అధికారం కోసం అర్రులు చాస్తోంది. దక్షిణాదిలో పట్టుకోసం బీజేపీ అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీల భవితవ్యం ఏమిటనేది తేలడం లేదు. మొత్తానికి అధికారం కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:
Bhadrachalam Flooded Villages: ముంపు పాపం ఎవరిది?