Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 21న ఫలితాలు వెలువడనున్నాయి. లోక్ సభ, రాజ్యసభతో పాటు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏ మద్దతుదారుగా ఒడిశాకు చెందిన గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్ష కూటమి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఎన్డీఏ మద్దతుదారు ముర్ముకే విజయావకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్డీఏకు ఆధిక్యత ఉండడం, ఒడిశాలోని బీజేడీ, ఆంధ్రాలోని వైసీపీ, టీడీపీ వంటి తటస్థ పార్టీలు ఎన్డీఏ కుమద్దతు తెలిపాయి. అటు శివసేన, జేఎంఎం వంటి పార్టీలు సైతం మద్దతు ప్రకటించడంతో ద్రౌపది ముర్ము విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఏపీ విషయానికి వచ్చేసరికి రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 173 మంది ఓటు వేశారు. ఇద్దరు సభ్యులు ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. ఆ ఇద్దరూ టీడీపీకి చెందిన వారే కావడం విశేషం. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. బాలక్రిష్ణ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు. బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే ఓటింగ్ పూర్తయిన తరువాత బ్యాలెట్ బాక్సులను పార్లమెంట్ ప్రాంగణంలోకి తరలించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే అక్కడకు చేర్చారేు. గురువారం లెక్కించి రాష్ట్రపతి అభ్యర్థిగా విజయం సాధించిన వారి పేరు ప్రకటించనున్నారు.
ఢిల్లీకి ముగ్గురు ప్రతినిధులు…
లెక్కింపు ప్రక్రియకు వైసీపీ తరుపున ముగ్గురు ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనసభ కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, చీప్ వీప్ ప్రసాదరాజును అధిష్టానం నియమించింది. వారు రాష్ట్రపతి అభ్యర్థుల ఓట్ల లెక్కింపులో ఏజెంట్లుగా వ్యవహరించనున్నారు. ఇందులో రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ సమయంలో కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. వైసీపీ ఎమ్మెల్యేల ఓటింగ్ ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
Also Read: Political Surveys in Telangana: సర్వే షాకింగ్: టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లకు అదే అర్థమైంది?
మొత్తం ఎమ్మెల్యేలలు ఓటింగ్ లో పాల్గొనేలా చూశారు. అందుకే అధిష్టానం మరోసారి ఆయన్ను కౌంటింగ్ ఏజెంట్ గా నియమించింది. వాస్తవానికి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కంటే వైసీపీ హడావుడే ఎక్కువగా సాగింది. రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే తమ మద్దతు ఎన్డీఏ అభ్యర్థికేనంటూ జగన్ సంకేతాలు పంపారు. బీజేపీ ద్రౌపది ముర్ము పేరు ప్రకటించిన వెంటనే స్వాగతించింది. అంతటితో ఆగకుండా ముర్ము నామినేషన్ ప్రక్రయకు ఏకంగా పార్టీకీలక నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు. అయితే మద్దతు అయితే ప్రకటించవచ్చు కానీ.. వైసీపీ చేసిన హడావుడి చూసిన జాతీయ నాయకులు మాత్రం ఏవగించుకుంటున్నారు.
ఆది నుంచి హడావుడి..
అటు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో రాష్ట్ర ప్రయోజనాలు సాధించడానికి అరుదైన అవకాశం వచ్చినా వైసీపీ, టీడీపీలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. ఎటువంటి షరతులు లేకుండా పోటా పోటీగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. దీనిని రాజకీయ విశ్లేషకులు, మేథావులు తప్పుపడుతున్నారు. కేవలం గిరిజన మహిళ అన్న సాకు చూపి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడిపోయారని విమర్శలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా సీఎం జగన్ వ్యవహార శైలిపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఏదో రోజు కేంద్రానికి మన అవసరం వస్తుంది. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుందామంటూ ఇన్నాళ్లూ జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఆ రోజు రానే వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల రూపంలో అరుదైన అవకాశం వచ్చినా జగన్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. కనీసం రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపుల్లో సైతం స్పష్టత తీసుకు రాలేకపోయారు. పోనీ పక్క తెలుగ రాష్ట్రం నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరే ధైర్యం చేయలేదు. ఇన్నాళ్లూ మన అవసరం పేరిట కాలం వెళ్లదీసిన సీఎం జగన్ కు మున్ముందు ఆ మాట చెప్పేందుకు కూడా వీలుపడదు.
Also Read:Getup Srinu- Yedukondalu: ఏడుకొండలు ఆరోపణలపై నోరు విప్పిన గెటప్ శ్రీను.. షాకింగ్ నిజాలు