Homeజాతీయ వార్తలుPM Modi, Vladimir Putin:తాలిబన్లకు రష్యా మద్దతు.. పుతిన్ కు మోడీ ఫోన్.. కీలక పరిణామం

PM Modi, Vladimir Putin:తాలిబన్లకు రష్యా మద్దతు.. పుతిన్ కు మోడీ ఫోన్.. కీలక పరిణామం

PM Modi, Vladimir PutinPM Modi, Vladimir Putin: అఫ్గాన్ (Afghanistan) లో పరిస్థితులు మారుతున్నాయి. తాలిబన్ల (Taliban) ఆక్రమణ తరువాత ప్రజలు తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గురువారం నిర్వహించే అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఫోన్ చేశారు. అఫ్గాన్ సంక్షోభంపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన సంభాషణలో పలు అంశాల గురించి మాట్లాడుకున్నారు.

అఫ్గాన్ లో పరిణామాలపై ఫోన్ మాట్లాడిన అనంతరం ప్రధాని మోడీ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో భారత్, రష్యా సంబంధాలపై చర్చించామన్నారు. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించబోమని స్పష్టం చేశారు. రష్యా, చైనా, బ్రిటన్ సహా పెద్ద దేశాలన్ని సంయమనం పాటించడం మంచిదేనన్నారు. అఫ్గాన్ లో శాంతిభద్రతలు కాపాడుకోవడం కీలకమని పీఎంవో సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించబోమని స్పష్టం చేశారు. భారత ఎంబసీని మూసివేసి ఆపరేషన్ దేవి శక్తి పేరుతో అక్కడి వారిని స్వదేశానికి తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 800 మందిని తరలించినట్లు చెప్పారు. ఇందులో భారతీయులే కాకుండా అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నారని గుర్తు చేశారు రష్యా తన రాయబార కార్యాలయాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాలిబన్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంది. తాలిబన్ ప్రభుత్వంపై తొందరపడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు.

అఫ్గాన్ సంక్షోభంపై ఈనెల 26న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోయే సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్, పార్టీల నేతలు పాల్గొనున్నారు. అమెరికా తప్ప మిగతా దేశాలన్ని అఫ్గాన్ లో తాలిబన్ పాలనకు సూత్రప్రాయంగా మద్దతు లేదా అంగీకారం తెలపనున్నట్లు తెలుస్తోంది. అఖిలపక్ష భేటీలో అఫ్గాన్ సంక్షోభంపై మోడీ సర్కారు తన విధానాన్ని మరోసారి స్పష్టం చేసే అవకాశాలున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Rajinikanth Biopic

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...
Nagarjuna

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...
Ram Charan long break after Peddi

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan : ‘జన నాయగన్ ‘ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో...

Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని...
Chennai Love Story Movie

Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్...

Chennai Love Story : కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , బంపర్ ఓపెనింగ్స్ ని...
Oktelugu Epaper