జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కర్టెన్ రైజర్ షోకు గెస్టుగా వచ్చిన రామ్ చరణ్.. అద్భుతంగా గేమ్ ఆడుతున్నాడు. తొలి రోజు 8 ప్రశ్నలు ఎదుర్కొని, 80 వేల రూపాయలు గెలుచుకున్న రామ్ చరణ్.. రెండో రోజు టఫ్ క్వశ్చన్స్ ఎదుర్కొన్నారు. తొమ్మిదో ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి రూ. 1.60 లక్షలు గెలుచుకున్న చెర్రీ.. పదో ప్రశ్నకు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పి 3.20 లక్సలు సొంతం చేసుకున్నాడు.
అయితే.. 11వ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో.. లైఫ్ లైన్ ను వాడుకోవాల్సి వచ్చింది. 1971 బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో సముద్రంలో మునిగిపోయిన జలాంతర్గామి పీఎన్ ఎస్ ఘాజీ అసలు పేరు ఏంటీ? అన్నది ప్రశ్న. దీనికి సరైన సమాధానం డియాబ్లో. కానీ.. ఈ ఆన్సర్ చెర్రీకి తెలియలేదు. దీంతో.. వీడియో కాల్ ఏ ఫ్రెండ్ లైఫ్ లైన్ ను సెలక్ట్ చేసుకున్నాడు. మిత్రుడు, సినీ హీరో రానా దగ్గుబాటికి ఫోన్ చేశాడు. దీంతో.. రానా సరైన సమాధానం చెప్పాడు. దీంతో.. చెర్రీ అకౌంట్లో రూ.6.40 లక్షలు వచ్చాయి.
12వ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం ద్వారా 12.5 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్.. 13వ ప్రశ్నకు మళ్లీ తడబడ్డాడు. బ్యూసీ పాలెస్ అనే గుర్రం ఎవరి వద్ద ఉంది? అన్నది ప్రశ్న. దీనికి సరైన సమాధానం అలెగ్జాండర్ ది గ్రేట్. కానీ.. చెర్రీ దీన్ని గుర్తించలేకపోయాడు. దీనికోసం అనివార్యంగా రెండో లైఫ్ లైన్ ను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం 50 – 50 ఆప్షన్ ను ఎంచుకున్నాడు. దీంతో.. అశోక దిగ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్ ఆప్షన్స్ మిగిలాయి. ఇందులో అలెగ్జాండర్ ను సెలక్ట్ చేసుకోవడంతో ఈ రౌండ్ కూడా గెలిచాడు. దీంతో.. 25 లక్షలు వచ్చాయి. 13వ ప్రశ్న అడగాల్సి ఉన్న సమయంలో సమయం ముగిసిపోవడంతో గేమ్ ను మరుసటి రోజుకు వాయిదా వేశారు.
ఆద్యంతం తనదైన గేమ్ తో చెర్రీ ఆకట్టుకున్నాడు. హోస్టుగా జూనియర్ అలరించాడు. ఈ క్రమంలో చెర్రీకి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నాడు. ఉపాసన చెర్రీని ‘మిస్టర్ సి’ అని పిలుస్తుంది. దీనికి కారణమేంటీ? అని జూనియర్ అడిగాడు. దానికి ఓ కథ ఉందని చెప్పాడు రామ్ చరణ్. వెకేషన్ కోసం లాస్ ఏంజెల్స్ కు వెళ్లినప్పుడు అక్కడ ‘మిస్టర్ సి’ అనే హోటల్ ఉందట. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చెఫ్ మిస్టర్ చిప్రియాన్ పేరు దానికి పెట్టారట. ఆ హోటల్ ఉన్నప్పటి నుంచీ తనను మిస్టర్.సి అని పిలుస్తున్నారని చెప్పాడు చెర్రీ.
ఇదిలాఉంటే.. రామ్ చరణ్ ఈ గేమ్ లో కోటి రూపాయలు గెలుస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ ఈ షోను ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతో.. టీఆర్పీ రేటింగ్స్ కూడా భారీగానే నమోదవుతున్నాయి. మరి, మూడో రోజు షోలో చెర్రీ ఎంత గెలుచుకున్నాడు? మధ్యలోనే వెనుదిరిగాడా? కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లాడా? అన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ram charan will win one crore rupees in ntrs emk show
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com