లాక్ డౌన్ కొనసాగించక పోవచ్చని ప్రధాని మోదీ సంకేతం

కరోనా వైరస్ కట్టడికి మూడు వారాలపాటు అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరింతగా పొడిగించే అవకాశం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అయితే దీనిని ఎత్తివేసిన తర్వాత తిరిగి ప్రజలంతా యధావిధింగా వీధులలోకి వస్తే తిరిగి వైరస్ విజృభించే అవకాశం ఉన్నందున చేపట్టే చర్యల గురించి ముఖ్యమంత్రులు సమిష్టిగా ఒక కార్యాచరణను రూపొందించాలని కోరారు. కరోనా వైరస్ కట్టడి గురించి రెండు వరాల కాలంలో రెండో సారి ముఖ్యమంత్రులతో […]

Written By: Neelambaram, Updated On : April 2, 2020 7:05 pm
Follow us on


కరోనా వైరస్ కట్టడికి మూడు వారాలపాటు అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరింతగా పొడిగించే అవకాశం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

అయితే దీనిని ఎత్తివేసిన తర్వాత తిరిగి ప్రజలంతా యధావిధింగా వీధులలోకి వస్తే తిరిగి వైరస్ విజృభించే అవకాశం ఉన్నందున చేపట్టే చర్యల గురించి ముఖ్యమంత్రులు సమిష్టిగా ఒక కార్యాచరణను రూపొందించాలని కోరారు.

కరోనా వైరస్ కట్టడి గురించి రెండు వరాల కాలంలో రెండో సారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించులు జరుపుతూ క్ డౌన్ ఎత్తివేత సందర్బంగా ప్రజలు ఒకేసారి పెద్ద యెత్తున బయటకు రాకుండా చూడాలని ప్రధాని సూచించారు.

లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఆయన సీఎంలతో చర్చిస్తూ లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై రోడ్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు.

వచ్చే కొద్దీ వారాలలో మన దృష్టి అంతా వైరస్ గురైన వారిని గుర్తించడం, వారిని ఇసోలాటిన్ లేదా స్వీయ నిర్బంధం గురించి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి చోటా వైరస్ తీవ్రంగా ఉన్న హాట్ స్పాట్స్ ను గురించి, వాటిని చుట్టుముట్టాలని, తద్వారా వాటి వ్యాప్తిని నిరోధించాలని కోరారు.

డాక్టర్లను, వైద్య సిబ్బందిని పెంచుకోవాలని సూచిస్తూ అత్యవసర మందుల కొరత లేకుండా, మందుల తయారీకి అవసరమైన ముడిపదార్ధాలు అందుబాటులో ఉండేవిధంగా, అవసరమైన వైద్య పరికరాలు లభించే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

ఆయన సీఎంలకు సూచించారు. ప్రతి జిల్లాలో నిఘా అధికారులను నియమించాలని ఆనయ చెప్పారు. లాక్ డౌన్ తర్వాత మునుపటిలాగా సాధారణంగా ఉండడానికి లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.