Megastar Chiranjeevi Record: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ బాక్స్ ఆఫీస్ డ్రీం రన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్తగా సినిమాలు కూడా విడుదల లేకపోవడం తో, మూవీ లవర్స్ కి ఈ చిత్రం తప్ప మరో ఛాయస్ లేదు. ఫలితంగా ఇప్పటికీ డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకు పోతుంది. 18 రోజుల థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి దాదాపుగా 285 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 174 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రాంతీయ బాషా చిత్రాల క్యాటగిరీలో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. 18 వ రోజున ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ దాదాపుగా 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా, 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇకపోతే కాసేపటి క్రితమే నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన మరో మెయిలు రాయి లాంటి రికార్డు ని అభిమానులతో పంచుకున్నారు. నైజాం ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 30 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి అట. అంటే 30 లక్షల మంది జనాలు కేవలం ఈ ఒక్క ప్రాంతం నుండే చూశారట. ప్రాంతీయ బాషా చిత్రాల క్యాటగిరీలో ఇదొక ఆల్ టైం రికార్డు అని అంటున్నారు. ఈ 30 లక్షల టికెట్స్ కి గాను 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నైజాం ప్రాంతం నుండి వచ్చాయట. ఇది సాధారణమైన రికార్డు కాదు. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి లో కూడా ఎలాంటి భారీ సినిమాలు విడుదల లేవు కాబట్టి, బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పట్లో జోరు తగ్గేలా కనిపించడం లేదు. 50 రోజుల కేంద్రాల జాబితా కూడా చాలా పెద్దగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
నిర్మాతలు చెప్పిన ఆ డేటా బుక్ మై షో + డిస్ట్రిక్ట్ యాప్ తో పాటు, కౌంటర్ లో అమ్ముడుపోయిన టికెట్స్ జాబితా ని కూడా కలిపి ఉంటుందట. ఇంత పెద్ద పోటీ లో వస్తేనే ఈ రేంజ్ లో ఇరగ కుమ్మిందంటే, సోలో గా రిలీజ్ అయ్యుంటే ఏ రేంజ్ కుమ్ముడు కుమ్మి ఉండేదో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ అందరిలో ఉన్నటువంటి క్యూరియాసిటీ ఏంటంటే, ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ ని రాబడుతుందా లేదా అనేదే. నిర్మాతలు అయితే ఏకంగా 350 కోట్ల గ్రాస్ పోస్టర్ ని వేసుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. ట్రేడ్ లెక్కల్లో మాత్రం ఇంకా ఈ చిత్రం 285 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగుతుంది. వచ్చే వారం థియేట్రికల్ రన్ ని బట్టి ఈ సినిమా 300 కోట్ల మార్కుని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
Out of 7 Films #MegastarChiranjeevi delivered Four 1cr+ Footfalls in Telugu States (AP/TG) after his comeback since 2017
The Biggest Regional Superstar ever in the history of Indian Cinema (Domestic) @KChiruTweets#KhaidiNo150 #SyeraaNaraSimhaReddy #Waltairveerayya… pic.twitter.com/6I392gHBOL
— NEWS Boxoffice (@NEWS_BOXOFFICE) January 30, 2026