DMK Vs TVK: మరికొద్ది నెలల్లోనే తమిళ నాడు లో సార్వత్రిక ఎన్నికల పోటీ జరగనుంది. ఈసారి తమిళనాడు ఎన్నికలపై దేశం మొత్తం ద్రుష్టి పెట్టనుంది. ఎందుకంటే తమిళం లో నేటి తరం సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న తలపతి విజయ్(Thalapathy Vijay) TVK పార్టీ ని స్థాపించి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. వరుస బ్లాక్ బస్టర్స్ తో జెన్ Z యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని పీక్ ఫార్మ్ లో ఉన్న విజయ్ కి యూత్ ఆడియన్స్ ఓట్లు ఎవ్వరూ ఊహించని విధంగా పడుతాయని అంతా అనుకున్నారు. కానీ లేటెస్ట్ సర్వే రిపోర్ట్స్ ని చూస్తుంటే, విజయ్ పార్టీ ఒంటరిగా వెల్త్ ఓట్లు చీల్చడం తప్ప, నయా పైసా ఉపయోగం లేదు, DMK పార్టీ మరోసారి భారీ విజయం సాధిస్తుంది అని చెప్తున్నాయి.
లేటెస్ట్ సర్వే రిపోర్ట్స్ ని ఒకసారి పరిశీలిస్తే DMK పార్టీ కి 45 శాతానికి పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉందట, అదే విధంగా AIDMK + Bjp పార్టీ కూటమి కి 38 శాతం కి పైగా వోటింగ్ నమోదు అవుతుందట. విజయ్ TVK పార్టీ కి 10 నుండి 12 శాతం ఓటింగ్ వస్తుందని,మిగిలింది ఇతరులకు వస్తుందని లేటెస్ట్ సర్వే రిపోర్ట్స్ తేల్చి చెప్పాయి. మొదటిసారీ పోటీలోనే 12 శాతం ఓటింగ్ వస్తుంది అనే రిపోర్ట్స్ రావడం చిన్న విషయం అయితే కాదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి మొదటిసారి పోటీ చేసినప్పుడు 6 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. విజయ్ పార్టీ కి జనసేన కంటే డబుల్ ఓటింగ్ వస్తుందని అంటున్నారు. మంచిదే, కానీ విజయ్ AIDMK + BJP కూటమితో కలిసి పోటీ చేస్తే DMK గెలిచే ప్రసక్తే లేదని సర్వేలు చెప్తున్నాయి. విజయ్ లక్ష్యం DMK పార్టీ ని గద్దె దించి అధికారం లోకి రావాలి అనేదే అయితే, ఆయన ఆ రెండు పార్టీలతో కలిసి వెళ్ళాలి.
లేదంటే DMK పార్టీ అవలీల మరోసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. AIDMK కూటమి విజయ్ తో కలిసి వెళ్ళడానికి సిద్దమే. విజయ్ తో ఇప్పటికే వాళ్ళు చాలా సార్లు చర్చలు జరిపారు. విజయ్ కూడా అప్పట్లో AIDMK తో కలవడానికి ఆసక్తి చూపించాడు. కానీ ఎప్పుడైతే ఆ కూటమి లోకి బీజేపీ వచ్చి చేరిందో , అప్పటి నుండి విజయ్ ఆ ఆలోచనని విసరమించుకున్నాడు. ఈమధ్య కాలం లో బీజేపీ కూడా విజయ్ తో చర్చలు జరిపి, కలిసి పోటీ చేద్దామని అన్నారు. కానీ విజయ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. బెదిరింపులు కూడా చేశారు , అయినప్పటికీ విజయ్ తగ్గలేదు. ఆయన మొండి పట్టుదల చూస్తుంటే ఒంటరిగానే ప్రభుత్వాన్ని తాను ఏర్పాటు చెయ్యగలను అనే నమ్మకం బలంగా ఉన్నట్లు ఉంది. కానీ ఒంటరిగా వెళ్తే బూడిదే అని సర్వేలు చెప్తున్నాయి, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.