‘ప్రస్థానం’ మూవీతో దర్శకుడు దేవాకట్టా టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దర్శకుడి మూవీలపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే దేవాకట్టా తదుపరి మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. సాయిధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా తాజాగా మూవీని తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనున్నారు. ‘బాహబలి’లో శివగామిగా అలరించిన రమ్యకృష్ణ ఈ మూవీలో సీఎం పాత్రలో నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో సాయిధరమ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నారు. పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రామాతో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ సీఎంగా నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లొసుగులను ఎత్తిచూపే యువకుడి పాత్రలో సాయితేజ్ కనిపించబోతున్నాడు. సాయితేజ్ రమ్యకృష్ణ ఢీకొట్టే సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. ఇటీవలే ‘ప్రతిరోజు పండగే’ పండుగ మూవీతో హిట్టందుకున్నాడు. రీసెంట్ గా కొత్త దర్శకుడు సుబ్బుతో ‘సోలో బతుకే సో బెటర్’ మూవీని చేశాడు. ఈ మూవీని మేలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.