Rajamouli Varanasi: రాజమౌళి(SS Rajamouli) సినిమా అంటే చిన్న పిల్లల దగ్గర నుండి, పెద్ద వయస్సు వాళ్ళ వరకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అసలు థియేటర్స్ ముఖం చూడని ప్రేక్షకులు కూడా రాజమౌళి సినిమా వచ్చిందంటే, టిక్కెట్ల కోసం క్యూలో నిలబడి కొట్లాడుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన ప్రతీ సినిమాకు అప్పటి వరకు ఉన్న క్రేజ్ ని పదింతలు పెంచే విధంగా ప్రొమోషన్స్ చేస్తూ వెళ్లడం రాజమౌళి స్టైల్. కానీ ఎందుకో ఆయన ‘వారణాసి’ చిత్రం విషయంలో క్రేజ్ ని ఎంత తగ్గిస్తే అంత మంచిది అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చాలా గ్రాండ్ గా #Globetrotter ఈవెంట్ ని జరిపి, ఈ సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే అదే ఈవెంట్ లో గుట్టు చప్పుడు కాకుండా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ ని, ‘రణ కుంభ’ సాంగ్ ని విడుదల చేశారు.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన సాంగ్స్ రిలీజ్ కానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానీ, రెండు మూడు రోజుల ముందుగా అభిమానులకు ముందస్తు సమాచారం అందిస్తుంటారు. కానీ ఈ చిత్రానికి అలాంటివి ఏమి జరగడం లేదు. మహేష్ బాబు అభిమానులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రమిది.యూట్యూబ్ లో విడుదలయ్యే పాటలకు, టీజర్స్ కి రికార్డు స్థాయి లో లైక్స్ కొట్టడానికి ప్లానింగ్స్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్స్ ఎలాంటి సమాచారం లేకుండా, సడన్ గా సోషల్ మీడియా లో ప్రత్యక్షమవుతున్నాయి. గతం లో ఏ రాజమౌళి సినిమాకు కూడా ఇలాంటివి జరగలేదు. ఇకపోతే నేడు ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది అట.
ఇలా ఈ సినిమా విడుదల తేదీని నేడు ప్రకటించబోతున్నట్టు రాజమౌళి టీం ముందస్తు సమాచారం అభిమానులకు ఇవ్వలేదు. సడన్ గా వచ్చారు , రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు, వెళ్లిపోయారు. విడుదల తేదీ ప్రకటించడం అనేది సినిమాకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం. కాబట్టి #Globetrotter ఈవెంట్ లాగా, ఒక భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల తేదీని ప్రకటిస్తారేమో అని అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఇంత సింపుల్ గా ప్రకటించడం చూసి, రాజమౌళి ఎందుకో ఈ చిత్రానికి భారీ హైప్ పెంచకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుందంటూ సోషల్ మీడియా లో అభిమానులు అంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహా లో వెళ్తే అభిమానులకు సహనం కోల్పోయే అవకాశం ఉంటుంది.