మెగాపవర్ స్టార్ రాంచరణ్ దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నాడు. ఈ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతరామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో రాంచరణ్ కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియాభట్ నటిస్తుంది. అయితే తాజాగా ఆమెకు టాలీవుడ్ నుంచి మీకు ఏ హీరో అంటే ఇష్టమనే ప్రశ్న ఎదురుకాగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. తనకు ‘బాహుబలి’ ప్రభాస్ అంటే ఇష్టమంటూ తన మనస్సులోని మాటను ఏమాత్రం సంకోచించకుండా బయటపెట్టేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ మూవీ చూశాక అతనికి అభిమానిగా మారనని అలియాభట్ తెలిపింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిన సంగతి తెల్సిందే. ‘బాహుబలి’ సీరిస్ లతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ మూవీకి మిక్సడ్ రిజల్ట్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘సాహో’ తెలుగులో అనుకున్నంత విజయం సాధించలేదు. బాలీవుడ్లో మాత్రం ‘సాహో’ భారీ విజయం సాధించింది. దీంతో బాలీవుడ్లో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలకు బాలీవుడ్ ప్రేక్షకులకు ఫిదా అయ్యారు.
అలియా భట్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ లో చెర్రీకి జోడీగా నటిస్తుంది. అదేవిధంగా బాలీవుడ్లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగూభాయి’ మూవీలో నటిస్తుంది. అదేవిధంగా రన్బీర్ కపూర్ కు జోడీగా ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఈ భామ నటిస్తుంది. ‘డార్లింగ్’కు ఇప్పటికే మహిళల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక హీరోయిన్లయితే ఒక్కసారైనా ‘డార్లింగ్’ కలిసి నటించడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఈ లిస్టులో తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చేరడం ఆసక్తికరంగా మారింది.