బీజేపీపై సంచలన కామెంట్ చేసిన పీకే..!

వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు హిటెక్కాయి. ఇప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో బీజేపీ పగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. అయితే బీజేపీ వ్యూహాలకు ప్రతీగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. దీంతో బీజేపీ.. తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. వచ్చే […]

Written By: Neelambaram, Updated On : December 21, 2020 1:05 pm
Follow us on

వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు హిటెక్కాయి. ఇప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి.

పశ్చిమబెంగాల్లో బీజేపీ పగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. అయితే బీజేపీ వ్యూహాలకు ప్రతీగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.

దీంతో బీజేపీ.. తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవరిస్తున్నాడు. తాజాగా ఆయనపై బీజేపీపై ట్వీటర్లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఎత్తులు వేసిన పది సీట్లకు మించి గెలువదని.. మమత బెనర్జీనే విజయం సాధిస్తుందని పీకే జోస్యం చెప్పాడు. బెంగాల్లో బీజేపీకి డబుల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ సవాల్ విసిరాడు.

ప్రశాంత్ కిషోర్ 2014 నుంచి దేశవ్యాప్తంగా అనేక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఆయన సపోర్టు చేసిన పార్టీలే ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నాయి. కాగా ఇటీవల బీహార్లో ఆర్జేడీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించినా ఆపార్టీ ఓటమి చవిచూసింది. దీంతో ఈసారి ఏ పార్టీ విజయం సాధిస్తుందోననే ఆసక్తి నెలకొంది.