https://oktelugu.com/

తిరుపతిని టార్గెట్‌ చేసిన టీడీపీ..: వ్యూహకర్తను రంగంలోకి దింపిందిగా..

మరికొద్ది రోజుల్లో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. దీంతో ఈ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలూ సిద్ధపడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ స్థానాన్ని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఛాలెంజ్‌గానే తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్‌ శర్మ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చి కొద్ది రోజులుగా తిరుపతిలోనే మకాం వేశారు. అక్కడే ఉండి పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. Also Read: జనసేనతో బీజేపీకి కష్టాలు రాబోతున్నాయా..! ఉప […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 21, 2020 / 01:01 PM IST
    Follow us on


    మరికొద్ది రోజుల్లో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. దీంతో ఈ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలూ సిద్ధపడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ స్థానాన్ని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఛాలెంజ్‌గానే తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్‌ శర్మ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చి కొద్ది రోజులుగా తిరుపతిలోనే మకాం వేశారు. అక్కడే ఉండి పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

    Also Read: జనసేనతో బీజేపీకి కష్టాలు రాబోతున్నాయా..!

    ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు అక్కడే ఉండి తన పాత్ర పోషిస్తారని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. రాబిన్‌ శర్మ గతంలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) బృందంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత బయటికొచ్చి ‘షోటైమ్‌ కన్సల్టింగ్‌’ పేరుతో ప్రత్యేకంగా సంస్థ పెట్టుకున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ కొన్ని రోజుల నుంచి అంతర్గతంగా పనిచేస్తున్నారు.

    Also Read: జగన్‌, బాబులకు బీజేపీ చెక్‌ పెట్టబోతోందా..?

    మరోవైపు.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. తమకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడమే ప్రధాన ప్రచారాంశంగా తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా తమ కేడర్‌కు ఉత్తేజాన్నిచ్చేలా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. తమకు ఎదురే లేదని.. నోరెత్తితే అణచివేతే అన్నట్లుగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. దానికి చెక్‌ పెట్టి నేలమీదకు దించేందుకు ఈ ఉప ఎన్నిక చక్కటి అవకాశమని ప్రజల్లోకి వెళ్తోంది. తెలంగాణలో ఎలా అయితే టీఆర్‌‌ఎస్‌కు బీజేపీ చెక్‌ పెట్టిందో.. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్