https://oktelugu.com/

భూసర్వేతో లక్షన్నర కోట్ల ఆస్తులు వస్తయంట

ఏపీ ప్రభుత్వం మరో చారిత్రక పథకానికి తెరలేపింది. ఏపీలోనూ జగన్‌ సర్కార్‌‌ సమగ్ర భూసర్వేను ఈ రోజు నుంచి ప్రారంభించింది. సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈసర్వేను ప్రారంభించారు. దశలవారీగా పూర్తి చేయనున్నారు. ఈ సర్వే వల్ల రూ.లక్షలన్నర కోట్ల విలువైన సంపద ప్రజలకు చేరుతుందని ప్రభుత్వం చెబుతున్నా.. సర్వే ద్వారా ప్రజలకు సంపద ఎలా వస్తుందన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది. Also Read: తిరుపతిని టార్గెట్‌ చేసిన టీడీపీ..: వ్యూహకర్తను రంగంలోకి దింపిందిగా.. గ్రామాల్లో ఉండే […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 21, 2020 / 01:16 PM IST
    Follow us on


    ఏపీ ప్రభుత్వం మరో చారిత్రక పథకానికి తెరలేపింది. ఏపీలోనూ జగన్‌ సర్కార్‌‌ సమగ్ర భూసర్వేను ఈ రోజు నుంచి ప్రారంభించింది. సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈసర్వేను ప్రారంభించారు. దశలవారీగా పూర్తి చేయనున్నారు. ఈ సర్వే వల్ల రూ.లక్షలన్నర కోట్ల విలువైన సంపద ప్రజలకు చేరుతుందని ప్రభుత్వం చెబుతున్నా.. సర్వే ద్వారా ప్రజలకు సంపద ఎలా వస్తుందన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది.

    Also Read: తిరుపతిని టార్గెట్‌ చేసిన టీడీపీ..: వ్యూహకర్తను రంగంలోకి దింపిందిగా..

    గ్రామాల్లో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. అసలు వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకొమని కూడా ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు. దీంతో వాటికి కూడా హక్కు పత్రాలు ఇచ్చేందుకు జగన్‌ సర్కార్‌‌ నిర్ణయించింది. ఇప్పటివరకూ ఆయా ఆస్తుల్ని వాడుకుంటున్నప్పటికీ.. బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవడానికి కుదరడంలేదని ఇప్పుడు సర్వే చేయడం ద్వారా వాటిని తనఖా పెట్టుకునే చాన్స్ వస్తుందని తద్వారా రూ.లక్షన్నర కోట్ల సంపద వారికి చేరుతుందని అంటున్నారు.

    Also Read: జగన్ సర్కార్ మెడకు ‘బాక్సైట్’ ఉచ్చు

    ఏపీలోని గ్రామ కంఠాల్లో కోటిన్నరకి పైగానే ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలు ఉన్నాయట. వీటి విలువ లక్షన్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ భూములకు రెవెన్యూ సర్వే రికార్డులు లేవు. అవసరమైనప్పుడు ఏదైనా ధ్రువీకరణ పత్రం ఇచ్చే విధానమూ ఇంతవరకు లేదు. దీనివల్ల యజమానులు బ్యాంకు రుణాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. వివరాలు కూడా పంచాయతీల వద్ద లేవని ప్రభుత్వం చెబుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    అయితే.. ఇంతకాలం కొనుగోళ్లు, అమ్మకాలు పెద్ద మనుషుల మధ్య కాగితాల ద్వారా ఇవన్నీ జరిగాయి. దీని వల్ల చాలా చోట్ల వివాదాలు వెలుగు చూశాయి. ఇప్పుడు ప్రతీ ఆస్తి సర్టిఫికెట్‌ జారీతో యజమానికి తనకు సంబంధించిన ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. సమగ్ర సర్వే పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల పరిధిలో అన్ని రకాల భూముల రీ సర్వే చేస్తోంది. డ్రోన్ల ద్వారా ఏరియల్‌ సర్వే చేయనున్నారు. దాని ద్వారా ఆ విధంగా గ్రామ పరిధిలో ప్రతి ఇంటినీ, స్థలాన్ని హద్దులతో సహా గుర్తిస్తారు. అభ్యంతరాలను అక్కడిక్కడే పరిష్కరిస్తారు. ఒక్కో ఆస్తికి వేర్వేరుగా ఆస్తి సర్టిఫికెట్లను గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా పంపిణీ చేస్తారు. జగన్‌ నిర్ణయంతో ప్రజలకు నిజంగానే మేలు జరగనుందా..? భవిష్యత్తులో రుణాలు తీసుకునే వెసులుబాటు కలుగనుందా..? వేచి చూడాలి మరి.