Green Card : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బాధ్యతలు చేపట్టాక తీసుకుంటున్న నిర్ణయాలు ఆదేశంలోని వలసదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపిస్తున్న ట్రంప్.. గ్రీన్ కార్డు(Green Card) కూడా పర్మినెంట్ కాదని ప్రకటించారు. ట్రంప్ కార్డు ప్రవేశ పెట్టారు.. ఈ క్రమంలో ఉపాధ్యక్షుడు జేడీ.వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆందోళన పెంచాయి.
Also Read : అమెరికాలో ప్రతి ఏడాది ఎంత మంది గ్రీన్ కార్డులు పొందుతున్నారు.. అందులో భారతీయులు ఎంతమంది?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD.wans)ఇటీవల చేసిన వ్యాఖ్యలు వలసదారుల్లో, ముఖ్యంగా భారత సంతతి వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ‘గ్రీన్‌కార్డు పొందినంత మాత్రాన అమెరికా(America)లో ఎల్లప్పుడూ ఉండే హక్కు రాదు‘ అన్న వాన్స్ వ్యాఖ్యలు లక్షలాది మంది ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇటీవల వలస చట్టాలను కఠినతరం చేయడం ఆందోళనను మరింత పెంచింది. ఈ క్రమంలో యూఎస్ ఇమిగ్రేషన్(Immigration) అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. హెచ్–1బీ, ఎఫ్–1 వీసాలు, గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు(Indinans) ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికాలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే సమయంలో తనిఖీలు ఎక్కువగా ఉంటాయని, సహనంతో ఉండాలని తెలిపారు.
43 దేశాల పైరులపై ట్రావెల్ బ్యాన్..
ట్రంప్ ప్రభుత్వం 43 దేశాల పౌరులపై అమెరికా ప్రవేశ నిషేధం విధించే ప్రణాళికలు రూపొందిస్తోంది. భారత్ ఈ జాబితాలో లేనప్పటికీ, అమెరికా వెలుపల ప్రయాణాలు చేసే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్‌కార్డు, హెచ్–1బీ, ఎఫ్–1 వీసా హోల్డర్లు దేశంలోకి వచ్చే, వెళ్లే సమయంలో కఠిన తనిఖీల వల్ల వీసా స్టాంపింగ్ ఆలస్యం కావొచ్చని అధికారులు పేర్కొన్నారు. వలస నిబంధనలు కఠినతరం కావడంతో వ్యక్తుల వివరాలను లోతుగా పరిశీలించేందుకు ఎక్కువ సమయం పడుతోందని వివరించారు. విదేశాల్లో ఎక్కువ కాలం గడిపి తిరిగి వచ్చే వలసదారులు కస్టమ్స్(Custams), బోర్డర్ అధికారుల సుదీర్ఘ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పత్రాలు వెంట ఉంచుకోవాలి..
అధికారులు వలసదారులు తమ స్వదేశ పాస్‌పోర్ట్‌తో పాటు అన్ని పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు. గ్రీన్‌కార్డు, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఉపాధి ధ్రువీకరణ లేఖ, ఫెడరల్(Fedaral)ఆదాయపు పన్ను చెల్లింపులు, వేతన స్లిప్పులు వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యార్థులు యూనివర్సిటీ లేదా కాలేజీ నుంచి అనుమతి పత్రం, యూఎస్ బ్యాంకు ఖాతా వివరాలు చూపించాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో వలసదారులు అప్రమత్తంగా ఉండడం, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవడం కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.