https://oktelugu.com/

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపి సేవలకు అనుమతి..!

రాష్ట్రంలో అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓ.పి సేవలు యధావిధిగా కొనస్సగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా నేపథ్యంలో సాధారణ అనారోగ్య సమస్యలకు వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశం జరిగింది. సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 30, 2020 / 12:01 PM IST
    Follow us on


    రాష్ట్రంలో అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓ.పి సేవలు యధావిధిగా కొనస్సగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా నేపథ్యంలో సాధారణ అనారోగ్య సమస్యలకు వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశం జరిగింది. సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రులు బృందం స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చే వలస కూలీలు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మంత్రుల బృందం సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించి అధికారులకు తగిన మార్గనిర్దేశం చేసింది. ఈ మంత్రుల బృందం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యం) ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, హోం మంత్రి యం.సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, హరికృష్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్,సియంఓ అదనపు సిఎస్ డా‌.పివి రమేశ్,టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్, పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్, ఐజి వినీత్ బ్రిజ్లాల్ తదితరులు పాల్గొన్నారు.