రాష్ట్రాలకు కాసులు రాల్చని మోదీ ప్రభుత్వం

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్రాలు కలసి పోరాడదామని పిలుపు ఇవ్వడమే గాని తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్ధికంగా ఎదుర్కోవడంలో మాత్రం మోదీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతున్నది. ఇప్పటికి కరోనా విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో నాలుగు సార్లు వీడియో కాన్ఫరెన్స్ లు జరిపారు. ప్రతి సమావేశంలో ఆర్ధికంగా ఆదుకోవాలని సీఎంలు కోరుతూనే ఉన్నారు. కానీ ఈ విషయమై ప్రధాని మౌనం వహిస్తున్నారు. ‘కరోనా’ను ఎదిరించిన చిన్నారి..! లాక్‌డౌన్‌తో రాష్ట్రాలు పూర్తిగా […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 12:32 pm
Follow us on


కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్రాలు కలసి పోరాడదామని పిలుపు ఇవ్వడమే గాని తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్ధికంగా ఎదుర్కోవడంలో మాత్రం మోదీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతున్నది.

ఇప్పటికి కరోనా విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో నాలుగు సార్లు వీడియో కాన్ఫరెన్స్ లు జరిపారు. ప్రతి సమావేశంలో ఆర్ధికంగా ఆదుకోవాలని సీఎంలు కోరుతూనే ఉన్నారు. కానీ ఈ విషయమై ప్రధాని మౌనం వహిస్తున్నారు.

‘కరోనా’ను ఎదిరించిన చిన్నారి..!

లాక్‌డౌన్‌తో రాష్ట్రాలు పూర్తిగా ఆదాయం కోల్పోయాయి. ఇప్పటికే ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించిన వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్పుల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూలధన పెట్టుబడి కోసమే అప్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర నిర్వహణ కోసం ఆ నిధులను వినియోగించుకుంటే భవిష్యత్‌లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, పథకాల అమలు ఎలా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించవలసిన రుణాల చెల్లింపులను వాయిదా వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని 3.5 శాతం నుంచి 6 శాతం వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కనీసం వీటి ద్వారానైనా ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటుందని ప్రధాని మోడీకి వివరించినా ఇంకా ఫలితం లేదు.

బడా బాబుల అప్పులను మాఫీ చేస్తున్న కేంద్రం క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అంతా బాగున్నప్పుడు వేల కోట్ల రూపాయాలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్లాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని రకాలుగా కలిపి సగటున నెలకు రూ. 12,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే తెలంగాణకు లాక్‌డౌన్‌తో ఇప్పుడు రూ.500 కోట్లు రాలేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ప్రధాన ఆదాయ వనరులైన మద్యం అమ్మకాలు నిలిచిపోవడం, రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం, జిఎస్‌టి రాకపోవడం, మైనింగ్ ఆదాయం లేదు, పెట్రోల్, డిజీలు వినియోగం పడిపోవడంతో ఆ ఆదాయం కూడా పడిపోయింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కూడా తగ్గిపోయింది.

ఇప్పటికే లాక్ డౌన్ విధించి నెల రోజులు దాటి పోయింది. దీంతో రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితి నానాటికీ దిగజారుతోంది. పరిశ్రమలు తెరిపించి పన్నులు రాబట్టుకుందామన్నా కుదరడం లేదు. దీంతో ప్రభుత్వానికి ఒవర్ డ్రాప్ట్, రుణాలు తీసుకోవడం మినహా అన్ని దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది.