‘కరోనా’ను ఎదిరించిన చిన్నారి..!

కరోనా వైరస్ పెరుచేపితేనే ప్రపంచం గడగడలాడిపోతుంది. ఇంతటి భయంకరమైన వైరస్ ఏడాది వయసున్న ఓ బాబును ఏమీ చేయలేకపోవడం విశేషం. ప్రధాన మంత్రి నుంచి సాధారణ ప్రజలు కోవిడ్-19 బారినపడి బెంబేలెత్తుతున్నారు. కరోనా పాజిటివ్ సోకిన తల్లితో 18 రోజుల పాటు కలిసి ఉన్న ఏడాది బాబుకు వైరస్ సోకలేదు. దీంతో తల్లి కొడుకులు సురక్షితంగా కోవిడ్ ఆస్పత్రి నుంచి డిస్సార్జి అయ్యారు. ఈ సంఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. నగరి పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 12:09 pm
Follow us on


కరోనా వైరస్ పెరుచేపితేనే ప్రపంచం గడగడలాడిపోతుంది. ఇంతటి భయంకరమైన వైరస్ ఏడాది వయసున్న ఓ బాబును ఏమీ చేయలేకపోవడం విశేషం. ప్రధాన మంత్రి నుంచి సాధారణ ప్రజలు కోవిడ్-19 బారినపడి బెంబేలెత్తుతున్నారు. కరోనా పాజిటివ్ సోకిన తల్లితో 18 రోజుల పాటు కలిసి ఉన్న ఏడాది బాబుకు వైరస్ సోకలేదు. దీంతో తల్లి కొడుకులు సురక్షితంగా కోవిడ్ ఆస్పత్రి నుంచి డిస్సార్జి అయ్యారు.

ఈ సంఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. నగరి పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి ఢిల్లీలో జరిగిన ఓ మత పార్ధనలకు హాజరై వచ్చాడు. ఫలితంగా అతనికి జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అధికారులు అతన్ని గత నెల 5న తిరుపతిలోని కోవిడ్-19 ఆస్పత్రికి తరలించారు. వారిది ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబంలోని 20 మందిని వెంటనే క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారిని పరీక్షించగా ఇద్దరు మహిళలకు పాజిటివ్ అని తేలింది. ఆ ఇద్దరు మహిళలను గత నెల 8న చిత్తూరులోని కోవిడ్ -19 ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరు మహిళల్లో ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. కుటుంబ సభ్యులంతా అనుమానితులుగా క్వారంటైన్ కేంద్రంలో ఉండటం చిన్నారి సంరక్షణ బాధ్యతలు చూసేందుకు బంధువులు ఎవరూ రాకపోవడం వంటి కారణాలతో ఆ చిన్నారి తప్పని సరి పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి వద్దే ఉండాల్సి వచ్చింది. అయితే ఆస్పత్రిలో చేరిన తొలి రోజునే ఆ చిన్నారికి పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ వచ్చింది. తల్లి డిశ్చార్జికి నాలుగు రోజుల ముందు నుంచే రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించినా ఆ చిన్నారికి నెగెటివ్ అని వచ్చింది. కరోనాతో కలిసి ఉన్నా అతనికి వైరస్ సోకపోవడం ఒక రికార్డుగా అధికారులు భావిస్తున్నారు.