వీడుతున్న జనం.. మరోసారి దుర్భర పరిస్థితులు

కరోనా లాక్ డౌన్ తో జనంలో భయం మళ్లీ ఆవహించింది. మునుపటిలా లాక్ డౌన్ పెరిగిపోతుందని.. తిండికి బట్ట పొట్టకు కాన కష్టంగా మారుతుందన్న ఆందోళన వారిలో పెరిగిపోతోంది. ఆ భయమే ఖరీదైన పట్నాల నుంచి వారిని పల్లెలకు పయనించేలా చేస్తోంది. తెలంగాణలో బుధవారం నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో హైదరాబాద్ ఖాళీ అవుతోంది. ఉపాధి కోసం జిల్లాల నుంచి, ఏపీ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ లో పొట్టపోసుకుంటున్న వారు ఇప్పుడు సొంతూళ్లకు […]

Written By: NARESH, Updated On : May 13, 2021 1:54 pm
Follow us on

కరోనా లాక్ డౌన్ తో జనంలో భయం మళ్లీ ఆవహించింది. మునుపటిలా లాక్ డౌన్ పెరిగిపోతుందని.. తిండికి బట్ట పొట్టకు కాన కష్టంగా మారుతుందన్న ఆందోళన వారిలో పెరిగిపోతోంది. ఆ భయమే ఖరీదైన పట్నాల నుంచి వారిని పల్లెలకు పయనించేలా చేస్తోంది.

తెలంగాణలో బుధవారం నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో హైదరాబాద్ ఖాళీ అవుతోంది. ఉపాధి కోసం జిల్లాల నుంచి, ఏపీ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ లో పొట్టపోసుకుంటున్న వారు ఇప్పుడు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.

సెకండ్ వేవ్ లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉండడం.. లాక్ డౌన్ ను మళ్లీ పొడిగిస్తారనే భయంతోపాటు లాక్ డౌన్ తో ఉపాధిపోయిన ప్రైవేటు ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కూలీలు, చిరు వ్యాపారులు ఇప్పుడు స్వగ్రామాలకు పయనమవుతున్నారు.

తెలంగాణ సరిహద్దుల్లో ఎక్కడా చూసినా ఇప్పుడు మూట ముల్లె సర్దుకొని వాహనాల్లో తమ సొంతూళ్లకు పోతున్న వారే కనిపిస్తున్నారు.

లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎక్కువగా కూలీలు, చిన్నా చితకా పనులు చేసుకుంటున్న వారిపైనే ఎక్కువగా పడుతోంది. వారికి ఉపాధి కరువై బతుకు భయంతో సొంతూళ్లకు వెళ్లేలా చేస్తోంది. సొంతూళ్లో కలో గంజో తాగి బతుకుదామని అందరూ ఇలా పట్నాలను వదులుతున్న దారుణ పరిస్థితులు మరోసారి కనిపిస్తున్నాయి.