కేటీఆర్ నోట జగన్ మాట!

కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.” కొంతకాలం పాటు కరోనాతో కలిసి జీవనం సాగించాల్సి ఉంటుందని” ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అవే మాటలను ఊటంకించారు. కరోనాకి వ్యాక్సిన్ లేదా ఔషధాన్ని కనుగొనేవరకు ప్రజలు వైరస్ తో కలిసి జీవించడం నేర్చుకోవాలని కేటీఆర్ అన్నారు. కరోనా కట్టడిలో దేశం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. లాక్ డౌన్ తర్వాత భారత్ కు అధిక […]

Written By: Neelambaram, Updated On : May 4, 2020 12:46 pm
Follow us on

కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.” కొంతకాలం పాటు కరోనాతో కలిసి జీవనం సాగించాల్సి ఉంటుందని” ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అవే మాటలను ఊటంకించారు. కరోనాకి వ్యాక్సిన్ లేదా ఔషధాన్ని కనుగొనేవరకు ప్రజలు వైరస్ తో కలిసి జీవించడం నేర్చుకోవాలని కేటీఆర్ అన్నారు.

కరోనా కట్టడిలో దేశం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. లాక్ డౌన్ తర్వాత భారత్ కు అధిక పెట్టుబడులు వచ్చేలా కృషి జరగాలని ఆయన అబిప్రాయపడ్డారు. ఔషధ ఉత్పత్తి ప్రాధాన్యం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీకి మౌలిక వసతుల కోసం రూ. నాలుగు వేల కోట్లను కేంద్రం సమకూర్చాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుత పరిణామాలు జీవితాలకు, జీవనోపాధికి మధ్య బొమ్మా బొరుసు వంటివి కాకూడదని ఆయన అన్నారు.

అయితే జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ,సిపిఐ నేత రామకృష్ణ, మరికొందరు టిడిపి నతలు ఇష్టానుసారం నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ మంత్రి కెటిఆర్ కూడా అదే విషయం చెప్పారు.