Bandi Sanjay: శకునం చెప్పే బల్లే కుడిదిలో పడిందట. ప్రభుత్వ నిర్వహణకు ప్రధాన కారణంగా నిలిచేది యంత్రాంగమే. అంటే ఉద్యోగులే. వారు లేకుంటే పథకాలు ముందుకు సాగవు. పనులు పూర్తి కావు. కానీ ప్రస్తుతం వారి పరిస్థితే అగమ్యగోచరంగా మారుతోంది. నెలనెల రావాల్సిన వేతనాలు సమయానికి రావడం లేదు. ఫలితంగా వారి కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక మిన్నకుండిపోతున్నారు. చెప్పుకోకపోతే మానం పోతది చెప్పుకుంటే ప్రాణం పోతది అన్నట్లుగా వారి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఏదో ఒక రోజు ఆలస్యమైతే ఫర్వాలేదు కానీ వారాల తరబడి వాయిదా పడితే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఉద్యోగుల జీతాలు నెలనెల కాకుండా ఒక నెల జీతాలు మరో నెలకు వస్తున్నాయి. దీంతో వారికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలు ప్రాణసంకటంగా మారుతున్నాయి. నెలకు సరైన సమయానికి కాకుండా ఎప్పుడో వస్తున్నాయి. దీంతో వారి ఇబ్బందులు చెప్పనలవి కావడం లేదు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారికి భరోసా ఇస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని చెబుతున్నారు. దీంతో ఉద్యోగుల్లో మార్పు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Justice NV Ramana- Draupadi Murmu: రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్వీ రమణ.. అరుదైన అవకాశం
తెలంగాణలో ఉద్యోగుల జీతాల విషయంలో ప్రతిపక్షాలకు అవకాశం దొరుకుతోంది. దీన్నే అస్త్రంగా మలుచుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది. దీంతోనే ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే వేతనాలు చెల్లిస్తామని చెబుతూ వారిని తమ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. దీంతో కేసీఆర్ కు భయం పట్టుకుంటోంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ప్రతి నెల 15వ తారీఖు వరకు ఎదురు చూసే పరిస్థితి రాకూడదని సంజయ్ స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని చెబుతున్నారు.

ప్రతి నెల ఉద్యోగులకు, పెన్షన్ దారులకు చెల్లించేంది మూడు వేల కోట్లు. ఇవి కూడా సర్దుబాటు చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేసే ముఖ్యమంత్రిపై అందరిలో వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో వారి బాధలు అర్థం చేసుకున్న బీజేపీ సరైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తోంది. వారికి ఎలాంటి బాధలు లేకుండా చేయడమే కర్తవ్యమని చెబుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఉద్యోగులకు జీతాలు ఒకటో తారీఖునే ఇస్తామని అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చడం లేదు.
దీంతోనే ఉద్యోగుల్లో నైరాశ్యం నెలకొంది. సరైన సమయానికి జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకంత నిర్లక్ష్యమని వాపోతున్నారు. ఒకటో తారీఖు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు.
Also Read:TDP MPs: తలోదారిలో టీడీపీ ఎంపీలు? అసంతృప్తికి కారణాలేంటి?
[…] […]