Nidhi Agarwal: హీరోయిన్ల కెరీర్ మూడునాళ్ళ ముచ్చటే. ఈ విషయం లేటుగా అర్ధం చేసుకుంది నిధి అగర్వాల్. అందుకే, కెరీర్ కాలిపోయాక, ఇక ఎన్నిసార్లు కాళ్లు కడుక్కున్నా ప్రయోజనం ఉండడు అంటుంది. నిధి అగర్వాల్ మంచి అందగత్తె. కానీ ఆమె అత్యాశ ఆమెను నిండా ముంచేసింది. తొలినాళ్లలో వేసిన తప్పటడుగులు – ఆమె కెరీర్ రూట్‌నే మార్చేసింది.
Nidhi Agarwal
ఇప్పుడు బాధతో ఎన్ని సూక్తులు చెప్పినా అమ్మడికి కాలం కలిసి రావడం లేదు. అఖిల్ కి జోడీగా టాలీవుడ్ తెరపై తొలిసారి తళుక్కుమంది నిధి అగర్వాల్. ఈ భామ నాజూకు తనానికి తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కానీ డిజాస్టర్ సినిమాల హీరోయిన్ గా నిధిని విధి నిలబెటింది. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ తో ఆమె పై ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది.
Also Read: Ram Charan- Shankar Movie: ఇదంతా ఫేక్.. చరణ్, శంకర్ సినిమా పై మేకర్స్ క్లారిటీ
అనుకోకుండా నిధి కెరీర్‌కు బ్రేక్ పడింది. అందం, అభినయ సామర్థ్యమున్నా.. అవకాశాలు లేక ఎంతగానో నలిగిపోయింది. ఈ గందరగోళాల మధ్య నిధి అగర్వాల్ కి పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్.
కానీ.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ సినిమా రిలీజ్ కోసం నిధి అగర్వాల్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ తోనైనా తన దశ తిరుగుతుందని అమ్మడు ఆశ పడుతుంది. నిధి అగర్వాల్ ఇన్నాళ్లు పెద్ద స్టార్లతో చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఆమె చేతిలో ఉన్న పెద్ద సినిమా ఒక్క పవన్ సినిమా మాత్రమే.
Nidhi Agarwal
ఈ సినిమా హిట్ అయితేనే నిధికి స్టార్ హీరోలు అవకాశం ఇస్తారు. లేదు అంటే.. చిన్నాచితకా చిత్రాలతోనే ఇక కెరీర్ ను ముగించాల్సి వస్తోంది. ఏది ఏమైనా నిధి అభిమానులకు ఇది చేదైన వార్తే. మరోపక్క ‘హరిహర వీరమల్లు’ లో నిధి పాత్రను చాలా వరకు తగ్గించేశారు. ఆమె ఇప్పుడు ఒక గెస్ట్ ఆర్టిస్ట్ మాత్రమే. అసలుకే నిధి అగర్వాల్ కు ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయి.
ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమా కూడా ఆమె కెరీర్ కి ప్లస్ కాకపోతే.. ఇక సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గానే నిధి మిగిలిపోతుంది. మరి నిధి నిజంగానే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లకే పరిమితమవుతుందో ?, లేక, పిసరంత లక్ లక్కలా అంటుకుని.. మళ్ళీ స్టార్ హీరోయిన్ అవుతుందో చూడాలి.
Also Read:Megastar Chiranjeevi: చిరంజీవికి కోపమొచ్చింది.. డైరెక్టర్లకు చురకలు