https://oktelugu.com/

ఇక రాజకీయాల వైపు పవన్..:జనసైనికుల్లో ఉత్సాహం..

  ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న పవన్ కల్యాణ్ కొంత కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక తరువాత ఆయనకు కరోనా సోకడంతో నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత లాక్డౌన్ తదిర కారణాలతో పవన్ అటు సినిమాల్లో గానీ.. ఇటు రాజకీయల్లోనే కనిపించలేదు. అయితే తాజాగా పవన్ ఎక్కువగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల మధ్య కు వెళితేనే […]

Written By:
  • NARESH
  • , Updated On : July 3, 2021 / 02:33 PM IST
    Follow us on

     

    ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న పవన్ కల్యాణ్ కొంత కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక తరువాత ఆయనకు కరోనా సోకడంతో నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత లాక్డౌన్ తదిర కారణాలతో పవన్ అటు సినిమాల్లో గానీ.. ఇటు రాజకీయల్లోనే కనిపించలేదు. అయితే తాజాగా పవన్ ఎక్కువగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల మధ్య కు వెళితేనే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారట.

    మూడేళ్లు రాజకీయాల్లో ఉండి ఆ తరువాత వకీల్ సాబ్ సినిమాతో వెండితెరపై కనిపించాడు పవన్. దీంతో ఆయన ఫ్యాన్స్ లో ఎనలేని ఉత్సాహనం నెలకొంది. మరిన్ని సినిమాలు చేయాలని ఫ్యాన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కోరడంతో పవన్ మరో రెండు సినిమాలపై సైన్ చేశాడు. అయితే ఆయన క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పాల్గొంటుండగానే తిరుపతి ఉప ఎన్నిక వచ్చింది. దీంతో షూటింగ్ ఆపేసీ ఉప ఎన్నిక బిజీలో పడ్డారు. అయితే ఆ తరువాత ఆయనకు కరోనా సోకడంతో విశ్రాంతి తీసుకున్నారు.

    తాజాగా ఆయన రాజకీయాలపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పవన్ రాజకీయాలకు దూరంగా ఉండడంతో జనసేన పార్టీ నాయకులు సైతం నిరుత్సాహంగా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని చోట్ల జనసైనికులు తమ అభ్యర్థులను గెలిపించుకోవడంతో కొంత ఆశ నెలకొంది. అయితే ఆ తరువాత తిరుపతి ఉప ఎన్నికతో పాటు పవన్ సినిమాల వైపు వెళ్లడంతో రాజకీయంగా జనసైనికులు సైతం యాక్టివ్ నెస్ కోల్పోయారు.

    దాదాపు మూడు నెలల తరువాత పవన్ ఏపీకి రానుండడంతో జనసేన నాయకులు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై పోరాడేందుకు రూట్ మ్యాప్ ను ఏర్పాటు చేశారట. ప్రభుత్వం పథకాలు ప్రకటించినా అవి ప్రజలకు చేరలేదన్న కారణంతో ప్రజల వద్దకు వెళ్లి అడగనున్నారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము పోరాడేందుకు ముందుంటామని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.గతంతో రైతు సమస్యలపై జిల్లాల పర్యటన చేసిన పవన్ ఇప్పుడు ఎలాంటి సమస్యలపై ముందుకు వెళుతారో చూడాలి.