పెరుగుతున్న శివారు కాలనీలు

ఆధునిక జీవనం మారుతోంది. సకల సదుపాయాలతో నూతన పద్ధతులతో ఇళ్ల నిర్మాణానికి అలవాటు పడుతున్నారు. ఇందులో భాగంగా నగర శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇన్నాళ్లు సిటీ మధ్యలో ఇల్లు కట్టుకోవాలని భావించినా కాలుష్యం ప్రభావంతో బయట ప్రాంతాలకే మొగ్గు చూపుతున్నారు. అందరికి కార్లు ఉండడంతో ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఎంత దూరమైనా క్షణాల్లో చేరుకునే వీలుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. పైగా శబ్ద కాలుష్యం ఉండకపోవడంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు. పది నుంచి వంద […]

Written By: Raghava Rao Gara, Updated On : July 3, 2021 2:44 pm
Follow us on

ఆధునిక జీవనం మారుతోంది. సకల సదుపాయాలతో నూతన పద్ధతులతో ఇళ్ల నిర్మాణానికి అలవాటు పడుతున్నారు. ఇందులో భాగంగా నగర శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇన్నాళ్లు సిటీ మధ్యలో ఇల్లు కట్టుకోవాలని భావించినా కాలుష్యం ప్రభావంతో బయట ప్రాంతాలకే మొగ్గు చూపుతున్నారు. అందరికి కార్లు ఉండడంతో ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఎంత దూరమైనా క్షణాల్లో చేరుకునే వీలుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. పైగా శబ్ద కాలుష్యం ఉండకపోవడంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు.

పది నుంచి వంద ఎకరాల విస్తీర్ణంలో వంద నుంచి ఐదు వందల విల్లాలు ఒకే చోట నిర్మిస్తుండడంతో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆట స్థలాలు, ఈత కొలను, క్లబ్ హౌస్, పార్కులు, అతిథుల కోసం ప్రత్యేక గదులు నిర్మిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వినియోగదారులు తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ సిటీ బయట స్థలాలు కొనుగోలు చేసేందుకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక హంగులతో సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. మధ్య తరగతి వారు సైతం తమ ఇళ్ల నిర్మాణానికి పక్కాగా ఉంటాయని భావించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరం బయటనే ఎక్కువగా పెరుగుతోంది.

ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో దూరం తగ్గిపోతోంది. నగరం మొత్తం చుట్టి వచ్చేందుకు ఏర్పాటు చేసిన ఓఆర్ఆర్ తో ఎక్కడి వెళ్లాలన్నా సమయం తగ్గిపోతోంది. దీంతో ప్రజలకు నగరం ఎక్కువ దూరం కాకుండా దగ్గరగానే ఉన్నట్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో శివారు కాలనీల్లో సైతం షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ ల నిర్మాణం చేయడంతో ప్రజలకు అన్నిసౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.

హైదరాబాద్ లో సిద్ధంగా ఉన్న ఇళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. విల్లాలకు డిమాండ్ పెరగడంతో గరిష్టంగా రెండేళ్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. అన్ని సదుపాయాలు చూసుకుని తమ ఇష్టమైతే ఎంత ధరకైనా వెనకడుగు వేయకుండా ప్రజలు ఇళ్లు క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఒక్కో విల్లాను 137 చదరపు గజాల నుంచి ఐదు వందల గజాల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం రూ.1.40 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయి. అయినా వినియోగదారులు తమ కలను నెరవేర్చుకునే క్రమంలో ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు.