https://oktelugu.com/

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్, కాపుల అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి అనే అంశం ఎంచుకున్నారు. జూన్ 24న కాపు నేస్తం పథకం క్రింద, ఆర్థికంగా వెనుకబడిన కాపు,బలిజ, వెలమ,తెలగ మహిళల ఖాతాలలో రూ. 15 వేలు జమ చేయడం జరిగింది . ఈ అంశాన్నే పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటీ?..అన్నారు. చేసిన వాగ్దానాలకు కాపులకు చేస్తున్నాదానికి పొంతనలేదు అన్నారు. కాపు కార్పొరేషన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 30, 2020 / 05:18 PM IST
    Follow us on


    ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్, కాపుల అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి అనే అంశం ఎంచుకున్నారు. జూన్ 24న కాపు నేస్తం పథకం క్రింద, ఆర్థికంగా వెనుకబడిన కాపు,బలిజ, వెలమ,తెలగ మహిళల ఖాతాలలో రూ. 15 వేలు జమ చేయడం జరిగింది . ఈ అంశాన్నే పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటీ?..అన్నారు. చేసిన వాగ్దానాలకు కాపులకు చేస్తున్నాదానికి పొంతనలేదు అన్నారు. కాపు కార్పొరేషన్ కి కేటాయించిన నిధులు, కాపు నేస్తం పథకం అర్హుల సంఖ్య వంటి విషయాలను విమర్శించారు. పనిలో పనిగా కాపుల రిజర్వేషన్ డిమాండ్ ని పక్క దోవపట్టించాడనికే ఈ కాపు నేస్తం పథకం అని ఎద్దేవా చేశారు.

    ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి…

    ఇక్కడ మనం గమనించాల్సింది జగన్ ఎన్నికల సమయంలోనే కాపుల రిజర్వేషన్ కేంద్ర పరిధిలో అంశం… కావున దానిని నెరవేరుస్తానని మీకు హామీ ఇవ్వలేను అన్నారు. కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం, ఇప్పటి వరకు కేటాయిస్తున్న నిధులు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెట్టింపు చేస్తా అన్నారు. కాబట్టి కాపు రిజర్వేషన్స్ గురించి జగన్ వైఖరి ఎన్నికల ముందే బట్టబయలు చేసినప్పుడు, ఈ విషయంలో జగన్ ని నిలదీయం సబబు కాదు. అలాగే పవన్ మరో విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆర్ధికంగా వెనుక బడిన ఉన్నత సామాజిక వర్గం కోసం…కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ కల్పించింది. అందులో 5% రిజర్వేషన్ కాపులకు మాత్రమే చట్టం తేవాలన్నట్లు మాట్లాడారు.

    స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి వచ్చాను అని చెప్పుకొనే పవన్ ఆంద్రప్రదేశ్ లో వెనుకబడిన అన్ని సామాజిక వర్గాల కోసం కేటాయించిన రిజర్వేషన్ లో సగభాగం ఒక సామాజిక వర్గానికే దక్కాలని ఎలా అడుగుతారు. వీటిని ఓటు బ్యాంకు, కుల రాజకీయాలు కాక ఏమంటారు?. అధిక భాగం ఓటు షేరు కలిగిన కాపులకు ప్రాధాన్యం ఇచ్చి మిగతా సామాజిక వర్గాలకు అన్యాయం చేయండి అన్నట్లున్న ఆయన మాటలను సామాన్య ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి.

    చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

    వెనుక బడిన ఉన్నత వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 10% రిజర్వేషన్ సామాజిక వర్గాల వారిగా పంకాలు జరిపే అవకాశం, అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కాపులను మభ్యపెట్టడానికి వారికి ప్రత్యేకంగా 5% రిజర్వేషన్ కేటాయిస్తున్నట్లు తీర్మానాలు చేసినా, జీవోలు తెచ్చినా వాటి అమలు సాధ్యం కాదు. గత ఎన్నికలకు ముందు అమలుకాదని తెలిసినా చంద్రబాబు ఆ 10% రిజర్వేషన్ లో 5% రిజర్వేషన్ కేవలం కాపులకు మాత్రమే అని అసెంబ్లీలో తీర్మానం చేశారు. మరి ఇప్పుడు కూడా జగన్ కాపు ఓట్ల కోసం అమలుకాదని తెలిసినా మభ్య పెడుతూ ఓ జిఓ తేవచ్చు. దాని వలన జగన్ చిత్త శుద్ధిని కాపులు ప్రశ్నించాల్సివస్తుంది.